Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17వ రోజుకు చేరుకున్న కార్మికుల నిరవధిక దీక్షలు
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ఎస్‌ఎల్‌ఎస్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని కోరుతూ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలు గురువారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో భాగంగా కార్మికులు ప్రాజెక్టు గేట్ ముందు సుమారు గంట సేపు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. దీక్షా శిభిరాన్ని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో రైతు సంఘం మండల అధ్యక్షుడు యలమంచి శ్రీనుబాబు, వ్యకాస మండల కార్యదర్శి యలమంచి వంశీకృష్ణ, నాయకులు యాసా శ్రీనివాసరెడ్డి, తెల్లం ధర్మయ్య, కాక క్రిష్ణతో పాటు అఖిల పక్ష నాయకులు ఉన్నారు.