Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
దశాబ్దాల కాలంగా విద్యుత్ సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న గ్రామాలకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వెలుగు జిలుగులు అందుతున్నాయి. మండల పరిధిలోని ఎర్ర బోరు కొత్త గుంపు గ్రామానికి ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సౌకర్యంలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించాలని సీఎం ఆదేశాల ప్రకారం ఆయా ఆదివాసీ గ్రామాలకు ప్రత్యేక నిధులతో సంఘాల ఏర్పాటు చేసి కరెంటు వైర్ లాగి ఆదివాసీ గ్రామాల్లో వెలుగులు నింపారు. సుమారు మూడు లక్షల వ్యయంతో ఎర్రబోరు, కొత్త గుంపుకు విద్యుత్ సౌకర్యం కల్పించామని విద్యుత్ శాఖ ఎస్‌ఇ సురేంద్ర, డిఈ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇదే కాకుండా అరణ్య గ్రామాలకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యాన్ని సైతం త్వరగా పూర్తిచేసి అందిస్తామని వారు వివరించారు. కుర్నపపల్లి పంచాయతీలో గల ఎర్రబోరు కు సర్పంచ్ సోడి కృష్ణవేణి, ఏఈ మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి అధికారులను సమన్వయ చేయడంతో విద్యుత్ సౌకర్యం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సోడి నాగేశ్వరరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.