Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య, నర్సింహ
నవతెలంగాణ-పాల్వంచ
సాంస్కృతిక రంగానికి వంద కోట్ల బడ్జెట్ కేటాయించి సమగ్ర విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కేతరాజు ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కోరారు. పాల్వంచలో స్థానిక కెటిపిఎస్ ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్లో ప్రజానాట్యమండలి జిల్లా ఫ్రథమ మహాసభలు ఆదివారం వేముల కొండల్‌రావు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపైన కళారూపాలు తయారు చేసి ప్రజలను చైతన్య పరచాలన్నారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని, నియోజకవర్గంలో మిని రవీంద్రభారతిను నిర్మించి అంతరించి పోతున్న గ్రామీణ కళలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి నిర్మాణ భాధ్యులు ఎస్‌కె.షబీర్‌పాషా, జిల్లా కార్యదర్శి సాదూ ఇజ్జాగిరి, రాము, సిపిఐ మండల కార్యదర్శి పూర్ణచందర్‌రావు, కొత్తగూడెం ఎంపిపి బానోత్ కెస్లీ, బోయన్న, కాటూరి రాము, మజ్జిగ కొమురయ్య, మండల ప్రతినిధి కళాకారులు కొమ్మవరపు ఆదాం, పల్లె నర్సింహ, రమాచారి, ఎల్లంకి పాల్గొన్నారు.