Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, కార్యదర్శులుగా ఇర్పా, రాయపూడి
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
ప్రయివేటురంగంలో రిజర్వేషన్ల పోరాట సమితి భద్రాచలం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఇర్పా బాలకృష్ణ, రాయపూడి యేసురత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 35మందిని నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన డివిజన్ సదస్సులో కమిటీ గౌరవ సలహాదారులుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపి, ప్రముఖ వైద్యులు సోమయ్య, వెంకట్రావు, డాక్టర్ రవికుమార్‌లు ఎన్నికయ్యారు. డివిజన్ కమిటీలో మాలమహానాడు నాయకులు దాసరి శేఖర్, శెట్టి రాజరత్నం, అల్లాడి పౌల్‌రాజ్, ఏజెన్సీ దళిత సంఘం నుండి ముద్దా పిచ్చయ్య, బిఎస్పీ పార్టీ నుండి ఏవి రావు, ఏవిఎస్పీ నుండి కుంజా శ్రీను, గిరిజన లాయర్ అసోసియేషన్ నుండి రవివర్మ, మన్యసీమ రాష్ట్ర అధ్యక్షులు చిచ్చడి శ్రీరాంమూర్తి, కెవిపిఎస్ నుండి సాధనపల్లి సతీష్, కొరడా శ్రీను, మైనారిటీ సంఘం నుండి ఎండి మునాఫ్, జాకీర్, గిరిజన సంఘం నుండి కారం పుల్లయ్య, వ్యకాస నుండి గడ్డం స్వామి, తెలంగాణ మాదిగ దండోరా నుండి కె వెంకటేశ్వర్లు, మాదిగ గిరిజన సంఘం నుండి అలవాల రాజాలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యదర్శి రాయపూడి యేసురత్నం మాట్లాడుతూ అన్ని గిరిజన, దళిత సంఘాలను ఐక్యం చేసి ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తా మన్నారు.
పినపాక డివిజన్ కమిటీ ఎన్నిక
మణుగూరు..
పిఆర్‌పిఎస్ పినపాక డివిజన్ కమిటీని సదస్సులో ఏకగ్రీ వంగా ఎన్నుకు న్నారు. అధ్యక్ష, కార్యదర్శులు కోటా శ్రీనివాసరావు, కొమ రం కాంతారావుతో పాటు ఆఫీస్ బేరర్స్‌గా 11 మందిని, 45 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులుగా బ్రహ్మరాజుల శంకరయ్య, బి కిషన్‌నాయక్, చెన్నం ఆనందరావు, బండ్ల మునేశ్వరావు, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, నైనారపు నాగేశ్వరావు, కొడిశాల రాములు, బత్తుల వెంకటేశ్వర్లు, రావుల తిరుపతయ్య, బర్ల రాము, రాయల వెంకటేశ్వర్లు, చిన్న మల్లయ్య, కొడెం మోహన్‌రావులు ఎన్నికయ్యారు.