Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటీర పరిశ్రమగా గుడుంబ వ్యాపారం
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోవకర్గ కేంద్రమైన మణుగూరు నుండి ఓ బడా వ్యాపారి కనుసన్నల్లో ఏజెన్సీ గ్రామాలకు నల్ల బెల్లాన్ని సరఫరా చేస్తున్నారు. మణుగూరు కేంద్రంగా పెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా నల్ల బెల్లాన్ని జోరుగా రాత్రికి రాత్రే గిరిజన గూడేలకు తరలిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖాధి కారులు నల్లబెల్లం, పటిక కలిపి అమ్మిన వారిపై దాడులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. తూతూ మంత్రంగా నల్లబెల్లం విక్రయదారులపై దాడులు నిర్వహిస్తూ అసలు అమ్మకాల సూత్రదారులను అధికారులు వదిలేస్తున్నారనే ఆరోపణలు న్నాయి. పినపాక మండలంలో అధికంగా నల్లబెల్లం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టపగలు ఆటోల ద్వారా నల్లబెల్లం వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నప్పటికీ తనిఖీల్లో నల్లబెల్లం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రముఖ వ్యాపారి బినామీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని స్టాక్ పాయింట్ల ద్వారా విచ్చలవిడిగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. మణుగూరు, అశ్వాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో గుడుంబ వ్యాపారం రోజుకు లక్షల్లో జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా వర్థిల్లుతోంది. అశ్వాపురం మండలం తుమ్మలచెరువు పరిసర ప్రాంతాల అడవుల్లో గుడుంబా కాస్తున్నారు. మణుగూరు మండలంలో ఖమ్మంతోగు, బుగ్గా, గుర్రంపేటవాగు, పోచంపల్లి చెరువు అటవీ ప్రాంతాల్లో షిప్టుల వారీగా కూలీలను నియమించుకొని గుడుంబా తయారు చేస్తున్నారు. పినపాక మండలం అటవీ ప్రాంతంలోని పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో జోరుగా గుడుంబ తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఎడ్లబండ్లు, మోట ర్‌సైకిళ్ళు, సైకిళ్ల ద్వారా సరుకును పట్టణాలకు తరలిస్తున్నారు. గుడుంబా దందాకు రాజకీయ పార్టీల అండదండలు ఉండడంతో మూడు పువ్వులు, ఆరు కాయలు గా లక్షలు సంపాదిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నల్లబెల్లం విక్రయాలను, గుడుంబా తయా రీని అరికట్టాలని, ఎక్సైజ్‌శా ఖ కఠినంగా వ్యవహరిం చాలని మహిళలు, మహిళా సంఘాలు కోరుతున్నాయి.