Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి, వైరా సదస్సులో వక్తలు
నవతెలంగాణ-సత్తుపల్లి అర్భన్
ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డాక్టర్ ఎంఎఫ్.గోపినాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక కళాభారతిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రయివేటు రంగం 90 శాతానికి ఎగబాకి ప్రభుత్వరంగం 10శాతానికి పడిపోయిందన్నారు. ఈ క్రమంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంపన్నులైన పెత్తందారుల చేతుల్లోనే ప్రయివేటు రంగం ఉందని, నిరుద్యోగులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చన్నారు. దీనిలో ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి రిజర్వేషన్లను సాధించుకోవాలని కోరారు. రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రిజర్వేషన్లు భిక్షకాదని, అవి రాజ్యాంగం కల్పించిన హక్క అని అన్నారు. రిటైర్డ్ జడ్జి దేవమందిరం మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలందరిదీ ఒకటే కుటుంబమన్నారు. ఎంఆర్‌పిఎస్ నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి పూర్తిసహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం సత్తుపల్లి డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కొచ్చర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పరిగడుపు ముత్తారావు, గౌరవ అధ్యక్షునిగా బజ్జూరి సీతారాములు, సహాధ్యక్షులుగా పిల్లి మల్లిఖార్జున్, నల్లంటి నర్సయ్య, బి.ప్రతాప్‌కుమార్, కార్యదర్శులుగా రాజేశ్వరరావు, దానయ్య, జె.నాగార్జున, ప్రభాకర్, హెచ్.వెంకటేశ్వరరావు, న్యాయవాది సుదర్శన్, రాములు నాయక్, గోపిలతో పాటు మరో 42 మందితో కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాసంఘ నాయకులు, అన్నికులాల సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైరాలో...
ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసిన పాలకులు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పంచి నూటికి 85 శాతం మందిగా ఉన్న దళిత గిరిజన, బిసి, మైనార్టీల హక్కులను గౌరవంచాలని పిఆర్‌పిఎస్ జిల్లా ఛైర్మన్ డా||బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పర్చూరి గార్డెన్స్‌లో భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగిన వైరా డివిజన్ పిఆర్‌పియస్ సదస్సులో రాఘవులు హాజరై ప్రసంగించారు. పాలకులు ప్రభుత్వరంగాన్ని నాశనం చేసి ప్రైవేటు, కార్పోరేట్ శక్తులకు ఉత్పత్తి సాధనాలను, విద్య, వైద్యం, సమస్త రంగాలను అప్పగించారని అన్నారు. ఈ రంగాలలో జొరబడిన శక్తులు ప్రభుత్వం ద్వారా వేల ఎకరాల భూములను, విద్యత్, నీరు, సబ్సిడీలు, బ్యాంకుల్లో అప్పులు పొంది పరిశ్రమలు స్ధాపించి ఆయా వర్గాలకే ఉద్యోగ ఉపాది అవకాశాలను కల్పిస్తున్నారని అన్నారు. అందుకే ప్రైవేటు రంగ రజర్వేషన్ల సమస్య ముందుకొచ్చిందని వివరించారు. పిఆర్‌పియస్ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడారు. సదస్సులో ప్రముఖ వైద్యులు డి కోటయ్య, జిల్లా నాయకులు కెనర్సయ్య. గుగులోత్ ధర్మానాయక్, నందిపాటి మనోహర్, కంకణాల అర్జున్‌రావు, సూతకానిజయపాల్ పూర్ణకంటి రామారావు, బొంతు రాంబాబు, బాబునాయక్, మరికంటి వాసుదాసు, తదితరులు పాల్గొన్నారు.