Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉద్యమంలోనే చెరువుల పునరుద్ధరణ
ఆకాంక్షకు ఊపిరి
- జిల్లాలో మిషన్ కాకతీయ భేష్
- సిఎం ఓఎస్‌డి దేవపతి శ్రీనివాస్
నవతెలంగాణ-ఖమ్మం టౌన్
మిషన్ కాకతీయతో చెరువుల్లో జీవ, జల కనబడుతోందని సిఎం ఓఎస్‌డి దేవపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అను గుణంగానే నవతెలంగాణ రాష్ట్ర ఏర్పపడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెరువులకు పూర్వ వైభవం కల్పించేందుకు మిషన్ కాకతీయ పథకం చేపట్టారని అన్నారు. ఆదివారం కలెక్టర్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ ప్రగతి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన భిన్న ప్రచార మార్గాలపై కలెక్టర్ డిఎస్ లోకేష్ కుమార్‌తో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడు తూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టం, వెనుకబాటుతనాన్ని పారదోలేం దుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంద న్నారు. మిషన్ కాకతీయ తొలి దశలో చెరువు లు పిచ్చి మొ క్కలతో ఉండేవని, నేడు జలకళను సంతరించుకున్నా య న్నారు. జిల్లాలో ఈ పథకం ప్రగతి బాగుందన్నారు. కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ మిష న్ కాకతీయ మొదటి దశ పనుల గ్రౌండిగ్‌లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింద న్నారు. జిల్లాలో 43 శాతం పైగా గ్రీన్ కవర్ ఉన్నందున అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. సగటున ప్రతి సంవత్సరం 530 టిఎంసిల వర్షపునీరు జిల్లా భూభాగంలో కలుస్తోందన్నారు. అయినప్పటికి జిల్లాలో తాగునీటి సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలోని ప్రజలు, పశువులు, వన్యప్రాణులకు కేవలం 24 నుంచి 30 టిఎంసిల నీరు తాగేందుకు సరిపోతుందన్నారు. మిషన్ కాకతీయ పనులు నాణ్యతతో జరిగేటట్లు చూడడంతోపాటు, ప్రతి గ్రామంలో ఒక చెరువు తప్పనిసరిగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో భూగర్భ జలాలు రిఛార్జ్‌కు వీలుగా చిన్న బావిని తవ్వుకునేలా రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టు విధానం, నీటి సంరక్షణ ప్రాధాన్యతపై భిన్న ప్రచారం మార్గాలను అవలంభించి, ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సమావేశానికి హాజరైన కవులు, కళాకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఒఎస్‌డి శ్రీధర్ పాండే, 30 మందికి పైగా రచయితలు, కవులు పాల్గొన్నారు.