Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియాలోని సింగరేణి సివిల్ విభాగంలో నిర్వహిస్తున్న రైల్వే నిర్వహణ పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇప్టూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియా ఇన్‌చార్జి ఏస్వోటు జీఎం ఎండి.రజక్ పాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 24 మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. మారుతి సాయిరాం కన్‌స్ట్రక్షన్ గోదావరిఖని కంపెనీ చెందిన వెంకట్ టెండర్ పొందారన్నారు. నాలుగు నెలల క్రీతం వేతనాలతో పాటు ఇప్పటికి అమలవతున్నా అలవెన్స్ కూడా అమలు చేస్తానని మా సంఘంతో లిఖిత పూర్వక ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. కానీ కాంట్రాక్టర్ జాప్యం చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన జీతాల బకాయిలు, అలవెన్స్‌లు అమలు చేయడం లేదన్నారు. వెంటనే ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.మహేందర్, ఎం.మంగీలాల్, కె.నాగేశ్వరరావు, ఎం.భావ్‌సింగ్, శివరామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.