Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 1 నుంచి కొత్త బస్టాండ్‌ను ప్రారంభించి... పాత బస్టాండ్‌ను ఎత్తివేస్తామన్న ప్రభుత్వం దానిని దేనికి ఉపయోగిస్తారో స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ ఆధారంగా ఉపాధి, వ్యాపారాలు నిర్వహిస్తున్న వేలాది మందిని వీధిన పడవేయవద్ద ని కోరారు.
నవతెలంగాణ-గాంధీచౌక్
స్థానిక గాంధీచౌక్ లో కరపత్ర పంపిణీ కార్యక్ర మం ప్రారంభించిన నున్నా మాట్లాడుతూ పాత బస్టాండ్ లోకల్ బస్టాండ్‌గా ఉంటే వచ్చే నష్ట మేమిటో? చెప్పాలన్నారు. మన కంటే చిన్న జిల్లాలకు రెండు, మూడు బస్టాండ్‌లు ఉండగా ఖమ్మంకు ఎందుకు రెండు బస్టాండ్‌లు ఉండకూడదని, ఎందుకు తరలిస్తున్నారో మంత్రి కానీ, అధికారులు కాని ఇంతవరకు జిల్లా, నగర ప్రజలకు వివరణ ఇవ్వకపో వడం పలు అనుమా నాలకు తావిస్తుంద న్నారు. ఇప్పటికైనా ప్రజల అభీష్టం మేరకు తరలింపుని ఆపాలని, స్థానికంగా బస్టాండ్‌ని కొనసాగిం చాలని డిమాండ్ చేశారు. ఇది ఖమ్మం అని, ఇప్పటికే మార్కెట్ తరలింపు ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. తప్పుడు ఆలోచనలు మానుకొని బస్టాండ్ స్థానికంగా కొనసాగించి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అప్రోజ్ సమీనా, యర్రా శ్రీనివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, నాయకులు బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, యర్రా గోపి, భూక్య శ్రీనివాసరావు, పత్తిపాక నాగసులోచన, శీలం వీరబాబు, పాశం సత్యనారాయణ, శ్రీశైలం, కృష్ణ, మట్టిపల్లి వెంకన్న, మల్సూర్, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.