Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనివీరభద్రం
- పలు కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరిక
నవతెలంగాణ-కల్లూరు
పేదల సమస్యల పరిష్కారానికి తుది వరకూ పోరాడేది కమ్యూనిస్టు పార్టీలే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల పరిధిలోని యజ్ఞ నారాయణపురం, ముచ్చవరం గ్రామాలకు చెందిన 20 కుటుంబాలు తమ్మినేని సమక్షంలో గురువారం రాత్రి సీపీఐ(ఎం)లో చేరాయి. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజావ్యతిరేక ప్రభుత్వాల నిర్ణయాలపై సమరం సాగించే పార్టీ సీపీఎం అని స్పష్టం చేశారు. పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభకు మండల కమిటీ కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఎం సీనియర్ నాయకులు తాతా భాస్కర్‌రావు, గ్రామ సిపిఎం నాయకులు సామినేని హనుమంతరావు, సామినేని హనుమయ్య, రావి వెంకట ప్రసాద్, రావి కృష్ణయ్య, మండల నాయకులు మాదాల కోటేశ్వరరావు, బొట్టు నరసింహారావు, ముదిగొండ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన సిపిఎం సీనియర్ నాయకులు రావి గురవయ్య గహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.