Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్ : మండలంలోని మంగళ గూడెం గ్రామానికి చెందిన రాయల నరసయ్య కుటుంబాన్ని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. ఇటీవల రాయల నర్సయ్య భార్య కమలమ్మ మృతిచెందారు. ఈ సందర్భంగా కమలమ్మ చిత్రపటానికి తమ్మినేని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సీపీఎం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, సిపిఎం నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, బందెల వెంకయ్య,పేరుమలపల్లి మోహన్‌రావు, పొన్నెకంటి సంగయ్య, కొప్పుల రామయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, సిద్దినేని కోటయ్య తదితరులు నివాళులర్పించారు.