Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్వాపారస్తులకు జీఎస్టీ సరళీకృతం చేయాలని భారత్ బంద్‌లో భాగంగా కొత్తగూడెం వ్యాపారస్తులు నిరసన నిర్వహించారు. పెద్దబజార్ నుండి ప్లకార్డులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. నినాదులు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఖమ్మం జోన్ కూర శ్రీధర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిస్ట్రిబ్యూటర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆలిండియా ట్రేడ్ లీడర్స్ ట్రేడర్స్ పిలుపు మేరకు శుక్రవారం జీఎస్టీ సరళీ కృతం చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి దరిదాపు 950 సవరణలు జరిగా యని, రోజురోజుకు వ్యాపారస్తులకు కష్టతరంగా మారాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొదుమూరి శ్రీనివాస్, వందనపు రాము, రవికాంత్, వందనపు శ్రీధర్, పల్లపోతు సాయిబాబా, సభ్యులు వ్యాపారస్తులు పాల్గొన్నారు.