Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాధి వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ ఎంవి.రెడ్డి ఆదేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
ముల్కలపల్లి మండలం, సబ్బనపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కరోనా వ్యాధి సోకిన సంఘటనపై తక్షణం గ్రామంలో పర్యటించి వ్యాధి సోకడానికి గల కారణాలపై సమగ్ర నివేదికలు అందచేయాలని కలెక్టర్ ఎంవి రెడ్డి జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఏటూరి నాగరంలో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లొచ్చినట్టు నిర్దారణ జరిగిందని, తదపరి వారిలో ఒకరికి వ్యాధి లక్షణాలు కనిపించగా పరీక్షలు నిర్వహిస్తే వ్యాధి సోకినట్టు నిర్దారణ జరిగిందని, తన ద్వారా ఇతర కుటుంబ సభ్యులకు వ్యాధి సోకినట్టు ఆయన చెప్పారు. మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మెన్‌గా నియమించిన ఆరోగ్య కమిటీలు తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి వ్యాధి సంరక్షణ జాగ్రత్తలు పాటించాలన్నారు.