Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్ధిని రాణి రుద్రమరెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముందు భద్రాద్రి అని పేరు తగిలించి, పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంకు ఉనికిని లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, దేవస్థానానికి సంబంధించిన 1100 ఎకరాల భూములు ఆంధ్రరాష్ట్రంలో ఉంటే ఎందుకు ప్రశ్నించడం లేదని యువ తెలంగాణ పార్టీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించి, మాట్లాడారు. సింగరేణి ప్రధాన కార్యాలయం, కోర్టు ప్రాంగణం, కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్, ఎల్‌ఐసీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రూ.100 కోట్లతో భద్రాచలం అభివృద్ది చేస్తామన్న కేసీఆర్ నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నీళ్లపేరుతో మిషన్ కాకతీయకు వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇల్లందు, కొత్తగూడెం తదితర ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు. ఆంద్రలో కలిసిన 5 మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో కె.వెంకట్, కిరణ్, రవిందర్, వినరు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : తెలంగాణ ఏర్పటు అయిన దగ్గర నుండి లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని మంతి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలు ఊదరొడుతున్నారు. అసలు ఎక్కడ ఏ డిపార్డు మెంటులో ఎంత మందికి ఎప్పుడు ఇచ్చారో బహిరంగ చర్చకు రావాలని అనేకసార్లు మీడియా ద్వారా సవాల్ విసిరితే పట్టించుకోకుండా తోక ముడిచారని యువతెలంగాణ పార్టీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అన్ని రంగాలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓటు ఆయుధం. మోసపోవద్దని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆడబిడ్డగా పోటీ చేస్తున్నా తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ పాల్గొని మద్దుతు తెలిపారు.