Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మార్చి 2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్ పోటీలు జరగనున్నట్లు తెలంగాణ ఉమన్ 20-20 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2018 నుంచి 2021 వరకు ఖమ్మంలో మూడుసార్లు క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. అందులో 2019లో జాతీయస్థాయిలో జరిగిన మహిళా క్రికెట్ టోర్నమెంట్‌లో నేపాల్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడాయని, అదే తరహాలో నేపాల్, బంగ్లాదేశ్ జట్లు రానున్నాయన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న టోర్నమెంట్‌లో తెలంగాణ, తమిళనాడు, ఛండీఘర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జట్లు పాల్గొంటా యన్నారు. ఈ సంవత్సరం ఖమ్మం సర్దార్ పటిల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టర్న్ వికెట్ క్రికెట్ మైదానం హైద్రాబాద్‌లోని ఉప్పల్ తరహాలో అందుబాటులో ఉందని తెలిపారు. మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు మహిళా క్రికెట్ పోటీలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. తమ అసోసియేషన్‌తో పాటు రోటరి క్లబ్ అఫ్ సంభాద్రి భాగస్వామ్యంతో క్రికెట్ పోటీలను నిర్వహించ బోతున్నామన్నారు. అనంతరం ఆల్ ఇండియా ఉమెన్ టిి-20 పోస్టరును ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో వెంపటి సత్యనారాయణ, దొడ్డ రవి, డాక్టర్ కరీం, వి.సాంబమూర్తి, టిఎన్‌జిఓస్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ హసన్, అసోసియేషన్ బాధ్యులు మతిన్, గార్లపాటి కిషోర్, తెలంగాణ రాష్ట్ర క్రీడా కారిణి శైలజ తదితరులు పాల్గొన్నారు.