Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతకాని: మండల పరిధిలోని కొదుమూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా గన్నీ బ్యాగులు, గుడ్డ సంచులను ప్రధానోపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి చేతిలో మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో గుడ్డ సంచి కూడా అలాగే నిత్యం ఉండా లని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యలమద్ది వెంక టేశ్వర్లు, తాతా ప్రసాద్‌రావు, చావా రమేశ్‌బాబు, చిగురు రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.