Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖానాపురం హవేలీ : ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌళిక వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు అందిస్తే విద్యార్థు లకు ఉపయోగపడతాయని తెలిపిన నేపథ్యంలో వచ్చిన నోటు పుస్తకా లను సోమవారం ఖమ్మం నగరంలోని శాంతినగర్, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రవ ుంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా నారాయణరావు, నాగండ్ల కోటేశ్వరరావు, ఎంఈఓ శ్రీనివాసరావు, శాంతినగర్, ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి పాల్గొన్నారు.