Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
15,16,17 తేదీల్లో భద్రాచలంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి బాలోత్సవంలో కొత్త గూడెం త్రివేణి పాఠశాల విద్యార్థిని సీహెచ్ రిషితన్మయి కూచిపూడి నాట్య విభాగంలో అద్బుత ప్రతిభ కనబర్చి ద్వితీయ బహుమతిని గెలుపొందిందని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్, సీఆర్‌ఓ కాట్రగడ్డ మురళీ కృష్ణ, జెడ్‌ఎవో అనీల్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌సింగ్, ఉపాధ్యాయులు అభినందించారు.