Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
- పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం
- పలువురి అరెస్టు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఆర్టీసీ కార్మికుల సమ్మె తగిలింది. సమస్యను పరిష్కారానికి కేసీ ఆర్‌పై ఒత్తిడి తేవాలని సోమ వారం రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం డీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన అధికారులతో సమీక్ష రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సమయంలో కార్మికులు ప్రదర్శనగా డీఆర్‌డీఎ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నింగా పోలీసులు అడ్డకున్నారు. దీంతో తోపులాట జరిగింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యేలు బయటకురావాలని స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీకార్మికులు ఆకలితో అలమటిస్తుంటే రాష్ట్రమంత్రులు,ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, భూక్యారమేష్, జాటోత్ కృష్ణ, లక్ష్మి,బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితిసభ్యులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, ఈసం రమాదేవి, కందుల భాస్కర్, పిట్టల రాంచందర్, మేధిని లక్ష్మి, రత్నకుమారి,డి. లక్ష్మి, డేగల తరుణ్,యాకూబ్, ఆర్టీసీ, జేఏసీనాయకులు వైఎన్.రావు, చిట్టి బాబు, జమాల్, రాంబాబు, కాంగ్రెస్‌జిల్లా నాయకులు యెర్రా కామేష్, జనసమితి జిల్లా నాయకులు నవతన్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు సతీష్‌తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం వరకు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు ఆ కార్యలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను పోలీసలు అడ్డుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజకీయ పక్షాల నాయ కులు, కార్మిక సంఘాల నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందచేశారు. మహళా కార్మికుల ఇబ్బందులను గమనించే ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని కోరారు.