Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన గొప్ప నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జెడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు, సర్పంచ్ ఉమ్మనేని బాబు అన్నారు. మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, అంబేద్కర్ యూత్ నాయకుడు నవీన్‌కుమార్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు దేశంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు రాకేష్, నరేష్, అభిషేక్, రాము, రఘు, సందీప్ పాల్గొన్నారు.
.