Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను నాటడం, సంరక్షించడం మహత్కార్యంగా భావించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ జన్మదినోత్సవం సందర్భంగా ఖానాపురంలోని అన్నం సేవా ఫౌండేషన్‌లో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వనప్పటికీ ఆయనను ఇన్స్పిరేషన్‌గా తీసుకుని స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించామన్నారు. ప్రతి పారుడు మూడు మొక్కలు నాటి, వాటిని మూడేండ్ల పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరాన్ని పరిరక్షించే చర్యలకు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి ప్రాంతంలో మొక్కలు నాటుతూ మొక్కలను సంరక్షించాలని చెప్పారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.