Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో రైతుల పరిస్థితి దయానీయంగా మారిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేపల్లి మండలం విశ్వనాధపల్లిలో శనివారం నిర్వహించిన రైతు సంఘం కారేపల్లి మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేసే స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా పథకాల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఈనెల 10న ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు రైతులు తరలిరావాలని కోరారు.
తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షకార్యదర్శులుగా ముండ్ల ఏకాంబరం, వడ్డె అజరుబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సూరబాక సర్వయ్య, సహాయ కార్యదర్శిగా భూక్యా లక్ష్మణ్, కమిటీ సభ్యులుగా మరో ఏడుగురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వడ్లమూడి నాగేశ్వరరావు, కొండెబోయిన నాగేశ్వరరావు, కుందనపల్లి నరేంద్ర, వజ్జా రామారావు, కరపటి సీతారాములు, తమ్మినేని ముత్తయ్య, ఎస్‌కె.సైదులు, భూక్యా లక్ష్మన్, భాషం రామారావు, పాసిన్ని నాగేశ్వరరావు, దొంతు అనంతరాములు, వాసిరెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.