Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం సీతారాంపురంలో ఐకేపీ, ఉషోదయ గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరాఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు కనీస మద్దతు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. దీనివలన రైతు ఖాతాలోకే పైకం జమవుతుందన్నారు. అనంతరం గ్రామసమాఖ్యల ఆధ్వర్యంలో తయారు చేసిన క్లాత్ సంచులను ఆయన అవిష్కరించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం నిషేధం కారణంగా క్లాత్ సంచులను వినియోగించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ హన్మకొండ రమేష్, సర్పంచ్ బానోత్ మారు, తహసీల్దార్ డీ.పుల్లయ్య, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.