Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చింతకాని మండలం నాగలిగొండ గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసిన మహీంద్రా ట్రాక్టర్‌ను సర్పంచ్ సురేశ్‌కు శనివారం అందజేశారు. మహీంద్రా కంపెనీ నుంచి గ్రామ పంచాయతీలకు మొట్టమొదటి ట్రాక్టర్‌ను నాగిలిగొండ పంచాయతీ కొనుగోలు చేసిందని తెలిపారు. ట్రాక్టర్ ను గ్రామపంచాయతీ లో చెత్త సేకరణ కార్యక్రమానికి మాత్రమే ఉపయోగి ంచాలని సొంత పనులకు ఉపయో గించరాద న్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో ప్రభాకర్‌రావు, చింతకాని ఎంపీడీవో లలిత కుమారి, నాగిలిగొండ సర్పంచ్ చాట్ల సురేశ్, ఉప సర్పంచ్ కొనకంచి మధుసూదన్‌రావు, పంచా యతీ కార్యదర్శి కొండపల్లి అనిల్‌కుమార్, గ్రామ పెద్దలు రాంబాబు, ప్రవీణ్ రెడ్డి, మహేంద్ర షోరూం జీఎం బాలాజీ, డీజీఎం పెంట్యాల హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలు నాణ్యతతో నిర్మించాలి : డీపీవో శ్రీనివాసరెడ్డి
కల్లూరు : డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణ పనులు నాణ్యతతో నిర్మించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కల్లూరు మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్‌డబ్య్లూఎస్ ప్రాజెక్ట్ సమీపంలో డంపింగ్ యార్డు, తడి-పొడి చెత్త యూనిట్ నిర్మాణ పనులు డీపీఓ పరిశీలించారు. తొలుత గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలని కోరారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మాణానికి 18 కుంటల స్థలాన్ని కేటాయించడంతో ఈజీఎస్ పథకం ద్వారా తడి-పొడి చెత్త యూనిట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్కినేని నీరజ, రైతు సమన్వయ సమితి సభ్యుడు లక్కినేని రఘు, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఈఓ నాగేంద్రబాబు, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్‌కే.కమిలి, ఎంపీటీసీ కొండూరి కిరణ్‌కుమార్, వార్డు సభ్యులు అఫ్రోజ్, నరసింహారావు, రాయల నాగేశ్వరరావు, బానోతు కృష్ణ పాల్గొన్నారు.