Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మహిళల రక్షణకు ఎన్నో చట్టాలున్నా, వాటి గురించి ప్రజల్లో అవగాహన లేక పోవడం వలనే పలు నేరాలు జరుగు తున్నాయని జిల్లా న్యాయమూర్తి మైత్రేయి అభిప్రాయపడ్డారు. దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జీ.వైజయంతి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్.ఉపేందర్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు మనోధైర్యం, మహిళల రక్షణ చట్టాలపై శనివారం అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ అనేక సామాజిక కట్టుబాట్లకు లోబడి తమపై జరుగుతున్న లైంగికదాడులు, గహహింస, వివక్షకు వ్యతిరేకంగా మహిళలు పోరాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకూ ప్రశ్నించే హక్కు మహిళలకు ఉందని తెలిపారు. అన్ని విషయాల పట్ల విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా షీటీంను సంప్రదించవచ్చన్నారు. ఆపద సమయంలో డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధారిత సంస్థ సెక్రటరీ వినోద్‌కుమార్, కాలేజీ ప్రిన్సిపాల్ కష్ణమూర్తి, సెక్రటరీ అప్పిరెడ్డి, సీఐ సత్యనారాయణ, అంజలి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎస్‌ఐ వెంకట్‌రావు పాల్గొన్నారు.