Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భరత్' ఆధ్వర్యంలో...
మధిర :మధిరలోని భరత్ విద్యా సంస్థల విద్యార్థులు శనివారం వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని పల్లగిరి గుట్ట వద్దకు వెళ్లి ఉల్లాసంగా పాల్గొన్నారు. క్రీడాకార్యక్రమాలు నిర్వహించి వన భోజనాలు చేశారు. విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, శీలం విద్యాలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా టాలెంట్ స్కూల్ విహారయాత్ర
సత్తుపల్లి :స్థానిక టాలెంట్ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్ధులను శనివారం పెనుబల్లి మండలం నీలాద్రి కొండకు విహారయాత్రకు తీసుకెళ్లారు. రోజంతా ఆటపాటలతో విద్యార్థులు ఈ విహారయాత్రలో ఉల్లాసంగా గడిపారు. భోజన విరామం అనంతరం విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల యాజ మాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
న్యూలిటిల్ ప్లవర్ ఆధ్వర్యంలో...
వైరా:వైరాలోని న్యూలిటిల్ ప్లవర్ పాఠశాల విద్యార్థులు శనివారం వనసమారాధన నిర్వహించారు. కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేష్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆటపాటలతో కోలాహలంగా గడిపారు. సైన్స్ ఫెయిర్ లో పాల్గొని జూనియర్స్‌లో క్లీన్‌నెస్, హెల్త్‌లో రికగ్నైజ్‌ఫుడ్ అడాల్ట్రేషన్ ప్రదర్శించి ప్రథమ బహుమతి గెల్చుకున్న బీ.భువనకృతిని, గైడ్‌గా వ్యవహరించిన చక్రపాణిని, సీనియర్స్ విభాగంలో ఎడ్యుకేషనల్ గేమ్స్ మేధమెటికల్ మోడలింగ్ లో ప్లేవిత్ పైథాగర్స్‌ను ప్రదర్శించిన బి కీర్తనవర్మను, గైడ్‌గా వ్యవహరించిన శ్రావంత్ కుమార్‌లను వారు అభినందించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపల్ షాజీమాధ్యూ, ఏవో ఎస్. నరసింహారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సందడి
చింతకాని :మండల పరిధిలోని నాగిలిగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాల ఆవరణలో శనివారం వనసమారాధన నిర్వహిం చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించి, ఉల్లాసంగా గడిపారు. ప్రధానోపా ధ్యాయురాలు మన్నేపల్లి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పుష్పకుమారి, శ్యామ్‌సుందర్, ఆండాళ్లు, కృష్ణారావు పాల్గొన్నారు.