Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఎప్పటిలాగే మీ అభిమానం మాపై చూపి మమ్మల్ని ఆదరించి ఆశీస్సులు అందిస్తారని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను కోరారు. శనివారం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో 'వెంకీ మామా' ప్రీ రిలీజ్ కార్యక్రమం ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో నిర్వహించారు. తొలుత ఖమ్మంకు విచ్చేసిన చిత్ర యూనిట్ ఖమ్మం లోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం లో నటి,నటులు ప్రజలకు అభివాదం చేస్తూ సందడి చేశారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తీసిన ''వెంకీ మామా'' చిత్రానికి నిర్మాతలుగా దగ్గుబాటి సురేష్,కో నిర్మాత విశ్వద్ లు కూడా చిత్ర యూనిట్ తో ఖమ్మం విచ్చేశారు.ఫ్రీ రిలీజ్ లో ప్రత్యేక ఆకర్షణగా శ్రీ ముఖి,జబర్దస్త్ ఆది, చమక్ చంద్ర లు నిలిచారు.వారి మాటలతో విక్టరీ,అక్కినేని అభిమానులతో కేరింతలు కొట్టించారు.చిత్ర హీరో హీన్లు రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్(ఆర్ ఎక్స్ 100 ఫెమ్) లు ఖమ్మం ప్రజలకు క తజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు బాబీ, శ్రేయస్ మీడియా శ్రీనివాస్,దొడ్డ రవి,నల్లి శ్యామ్ లు పాల్గొన్నారు.
ఈ సినిమా లో నాగ చైతన్య నటన చాలా బాగుంది... : విక్టరీ వెంకటేష్,సినీ హీరో
సురేష్ ప్రొడక్షన్ లో తీస్తున్న వెంకీ మామా చిత్రం లో నాగ చైతన్య నటన చాలా బాగుంది.''ఎని సెంటర్ సింగిల్ హ్యాండ్'' అంటూ డైలాగ్ లు విసిరారు.ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను వెంకీ మామా గా పిలుస్తారు.ఈ 30 ఏళ్ల సినీ పరిశ్రమ లో నన్ను ఎంతగానో అభిమానులు ఆదరించారు. మీ అభిమానం అలాగే ఉండాలి.
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం.. : (సినీ నటుడు,అక్కినేని నాగ చైతన్య)
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం.నా జీవితం లో రెండు సినిమాలు ''మనం'' ''వెంకీ మామా'' చిత్రాలు మాత్రమే.నాకు మీ సపోర్ట్ చాలా అవసరం.ఇవి సినిమాలు కాదు జ్ఞాపకాలు.అల్లుడుగా మామా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు.చిత్ర యూనిట్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.