Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
ప్రతిగ్రామంలోనూ శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు తప్పకుండా నిర్మించాలని ట్రైనీ కలెక్టర్, రఘునాధపాలెం ఇంచార్జి ఎంపీడీవో ఆదర్శ్‌సురభి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా రఘునాధపాలెం మండలం లోని మంచుకొండ, హర్యాతండా, రాముల్‌తండా గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. గ్రామాల్లోని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇంటింటికీ ఇంకుడుగుంతను నిర్మించుకోవాలన్నారు. అలాగే చెత్త తరలింపునకు ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాములుతండా సర్పంచ్ గుజిరి, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.