Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-చర్ల
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల సేవలు మరువలేనివని, అమోఘమైనవని, ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో కరోనాకు సైతం భయపడకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలా పనిచేసి విశేష సేవలు అందించారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం భద్రాచలం నియోజకవర్గం లోని అన్ని మండలాలలో జర్నలిస్టులందరికీ తమ వంతుగా పది కేజీల బియ్యం,8 రకాల నిత్యావసర వస్తువులు అందించారు. కానీ చర్ల మండలంలో సొసైటీ అధ్యక్షులు పరుచూరి రవికుమార్, శ్రీనివాసరాజు, మండల టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రోత్సాహంతో ప్రతి జర్నలిస్టుకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అయిన నూనె, చింతపండు, పప్పులు, సబ్బులు, పసుపు , కారం ప్యాకెట్ అందించారు. చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కష్ణార్జున రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్ చార్జ్ తెల్లం వెంకట్రావు, రోడ్డు రవాణా డైరెక్టర్ గూడపాటి శ్రీనివాసరావు, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య, చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పరుచూరి రవికుమార్, సత్యనారాయణపురం సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరాజు, డీసీసీబీ డైరెక్టర్ కణితి తిరుపతిరావు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సోయం రాజారావు, బండి వేణు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ ను కట్టడి చేయడంలో ముందు వరుసలో ఉన్నది పాత్రికేయులేనని ఎమ్మెల్సీ బాలసాని లకీëనారాయణ అన్నారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెం పిఏసిఎస్ కార్యాలయంలో మండల ప్రింటు మీడియాకు చెందిన పాత్రి కేయులకు తన సొంత ఖర్చులతో 10 కేజీల బియ్యంతో పాటు నిత్యవసరాలు అందజేశారు. ఇటీవల ఆర్టిఏ సభ్యులుగా నియమితులైన వెంకటాపురం మండలానికి చెందిన గూడపాటి శ్రీనివాసరావును టీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తెల్లం వెంకట్రావ్, బోదెబోయిన బుచ్చయ్య, ఎంపిపి రేసులకీë, జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, పిఏసిఎస్ అద్యక్షులు డివిఎస్ రాజు, టిఆఆర్‌ఎస్ మండల అద్యక్షుడు అన్నెం సత్యనారాయణ మూర్తి, రైతు సమన్వయ సమితి మండల అద్యక్షుడు బత్తుల శోభన్‌బాబు, అధికార ప్రతినిధి జానీ పాషా, బొల్లి చిన్న వెంకటేశ్వర్లు తో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.