Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవటం కోసం రోజుకో మద్యం పాలసీ ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులపాల్జేయాలని చూస్తోంది. ప్రతీ వీధిలో ఒక వైన్‌షాపుకానీ, ఒక బార్‌షాప్‌కానీ అనుమతి ఇచ్చేందుకు యోచిస్తోంది. ప్రజలను మద్యపానానికి బానిసలుగా చేసి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు చూస్తోంది. గుడుంబా, చీప్ లిక్కర్, బెల్ట్‌షాపులను నియంత్రించాల్సింది పోయి, వాటిస్థానే కొత్త మద్యం విధానంలో భాగంగా నూతన మద్యాన్ని ప్రజలకు అందుబాటులో వుండే లిక్కర్‌ను ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. దీనికి తోడు ఇటీవల మరో కొత్త విధానానికి తెరలేపనుందని వినికిడి. మద్యంషాపులు బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్‌షాపులు ఉదయం ఆరు గంటలు మొదలుకొని రాత్రి మూడు గంటల వరకు మందు షాపులు తెరిచే వుంటాయని ఒక ప్రతిపాదన వినవస్తోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించటం కోసం అనే సాకుతో ఖరీదైన మద్యాన్ని హోటళ్ళల్లో, త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌ల్లో మద్యం విక్రయాలకు విరివిగా లైసెన్సు ఇచ్చే ఆస్కారం వుందని తెలుస్తోంది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా బార్‌షాపులు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడం కాకుండా... వీధి వీధికి మంచినీటి నల్లాలూ పెట్టడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
అయినాం రఘురామారావు, ఖమ్మం.