Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఖరీఫ్‌లో వరి విత్తే సమయం | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • Jun 21,2018

ఖరీఫ్‌లో వరి విత్తే సమయం

దీర్ఘకాలిక పంటలు జూన్‌ 20 వరకు, మధ్య కాలిక పంటలు జూలై 10 వరకు, స్వల్పకాలిక పంటలు జులై 30 వరకు వేసుకోవచ్చు.
ఖరీఫ్‌లో చలి తక్కువగా ఉండే జిల్లాలైన ఖమ్మం, నల్లగొండలో వరిని మరొక 10 రోజులు ఆలస్యంగా వేసుకున్నా ఇబ్బందులుండవు.
విత్తన మోతాదు కిలోలు : ఎకరాకు నాట్లు వేయడానికి 20నుంచి 25, డ్రమ్‌సీడర్‌ 10 నుంచి 12, వెదజల్లుటకు 12 నుంచి 15, మిషన్‌తో నాట్లువేయడానికి 10నుంచి 12
వరిసాగులో నూతన పద్ధతులు
కూలీల సమస్య అధిగమించడానికి ఈ కింద పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.
దమ్ము చేయకుండా : మెట్టవరి, ఎరొబిక్‌ వరి
దమ్ము చేసి: డ్రమ్‌సీడర్‌ వరి, నేరుగా వెదజల్లే వరి, యంత్రంతో వరి నాటుడు, శ్రీవరి, యాంత్రీకరించిన వరి.
నారుమడి: ఎకరానికి (5 సె.మీటర్లు లేదా 200చ.మీ) 20-24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి.
యూరియా: 2.2 కిలోలు, సూపర్‌ పాస్పేట్‌ 8.2 కిలోలు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 1.7 కిలోలు చివరి దుక్కిలో వేయాలి. పైపాటుగా 2.2 కిలోల యూరియ విత్తిన 12 నుంచి 14 రోజుల్లో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సింగ్‌ సూపర్‌ పాస్పేట్‌ రెట్టింపు మోతాదుతో వేయాలి. నారుమడిలో ఊద నిర్మూలనకు బ్యుటాక్లోర్‌ 5మి.లీ నీటిని విత్తిన 7-8 రోజుల్లో లేదా సైహలోపాప్‌-పి -బుటైల్‌ 2.మి.లీ నీటిని విత్తన 14 రోజులప్పుడు మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేయాలి.
ప్రధానంగా పొలంలో పాటించాల్సిన మెళకువలు
4నుండి 6 ఆకులు తొడిగిన నారును 25-30 రోజులు పైపైనా కుదురు కు 2 లేక 3 మొక్కలునాటాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సె.మీ వెడల్పు కాలిబాటను వర్షాకాలంలో తూర్పు, పడమరలుగా తీయాలి. చివరి దమ్ములో ఒక బస్తా డిఎపి (50కిలోలు, యూరియా 10కిలోలు, మ్యూరిట్‌ ఆఫ్‌ పోటాషియం 15కిలోలు వేసుకొని నాట్లు వేసుకోవాలి. చివరి దఫా యూరియాతో అంకురం దశలో మ్యూరిట్‌ ఆఫ్‌ పోటాషియం 15కిలోలు తప్పనిసరిగా వేయాలి. జింకు లోప నివారణకు తగు చర్యలు ముఖ్యంగా ప్రతి రెండు పంటలకు ఒక సారి ఎకరానికి 20కిలోల జింక్‌ సల్ఫేట్‌ చొప్పున భూమిలో వేయాలి.
కలుపు యాజమాన్యం నాటిన 3-5రోజుల్లోపు
బ్యుటాక్లోర్‌ 1.25లీ లేదా అనిలోఫాస్‌ 0.5 లేదా ప్రెటిలాక్లోర్‌ 0.5 లీటర్లు లేదా ఆక్సాడయార్జిల్‌ 35గ్రా. లేదా బెన్‌సల్ఫ్యురాన్‌ మిథైల్‌, ప్రెటిలాక్లోర్‌ 4కిలోలు 20కిలోల ఇసుకలో కలిపి పొలంలో పల్చగా నీరు ఉంచి చల్లుకోవాలి.
10-12 రోజులు: ఫైరజోసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ 80గ్రా. లేదా ఇధాక్సి సల్ఫ్యూరాన్‌ 50గ్రా. సైహలోఫాప్‌ -పి- బ్యూటైల్‌ 250 నుంచి 300 మి.లీ లేదా పినాకిప్రోప్‌పి. ఇథైల్‌ 200నుంచి 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
20-25రోజులు : బిస్‌ ఫైరిబ్యాక్‌ సోడియం 100 మి.లీ లేదా 2.4 డి. సోడియం సాల్ట్‌ 500నుంచి 600 గ్రా. లేదా 2నుంచి 4 డి మిథైల్‌ ఎస్టర్‌ 1.25లీ పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం : నాట్లు వేసేటప్పుడు నీరు పల్చగా ఉండాలి. పచ్చ బడిన తర్వాత నుంచి పైరు దుబ్బ చేసే దశ వరకు ఒక ఇంచు లేదా 3 ఇంచుల నీరుండాలి. చిరు పొట్ట దశ నుంచి గింజ కట్టే దశవరకు రెండు ఇంచుల నీరుండాలి. కోతకు పది రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి.
చీడపీడల యాజమాన్యం: వివిధ చీడపీడల ఉధృతిని అదుపులో ఉంచ డానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా పాటించాలి. కేవలం పురుగు మందులపైన ఆధారపడి సేద్యం చేయరాదు. తట్టుకునే రకాలను సాగు చేయాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలు తుంచి నాటాలి. ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి కాండం తొలిచే పురుగుఉధృతిపై నిఘాపెట్టాలి. సుడి దోమ ఆశించే ప్రాంతాల్లో కాలి బాటలు తీయడం తప్పని సరి. నత్రజని సిఫారసు చేసిన మోతాదులో పలు దఫాలుగా వేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. వివిధ తెగుళ్ల నివారణకు పొలంలోనూ, గట్లమీద కలుపు లేకుండా చూడాలి. ఆర్థిక నష్టపరిమితి స్థాయినిబట్టి వివిధ పురుగులు, తెగుళ్లకు సిఫారసు చేసిన మందులను మాత్రమే పిచికారి చేయాలి.
సస్యరక్షణ పురుగులు
కాండం తొలుచు పురుగులు
ఈ పురుగు సోకిన పిలకలు చనిపోతాయి. వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి. 5 శాతం మొవ్వులు చనిపోయిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 2.0 గ్రా. లేదా ఎసిఫేట్‌ 1.5గ్రా లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్‌ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా కార్బొప్యురాన్‌ 3జి 10కిలోలు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి 8 కిలోలు లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్‌ 0.4శాతం నాలుగు కిలోల చొప్పున ఎకరానికి వేసుకోవాలి.
ఉల్లికోడు: వారం రోజుల ముందు 5 సెంట్లు నారుమడికి కార్బొప్యూరాన్‌ 3జి గుళికలు 800గ్రా. లేదా ఫోరేట్‌10జి గుళికలు 250 గ్రా. చొప్పున వేయాలి నాటిన 15 రోజులకు కార్బొప్యూరాన్‌ 10కిలోలు ఎకరానికి వేయాలి.
దోమపోటు, సుడి దోమ
గోధుమ వర్ణపు దోమ, తెల్లమచ్చ దోమ వరిపైరును ఆశిస్తాయి. పిల్ల, పెద్ద దోమలు దుబ్బలు మొదళ్ల దగ్గర ఉండి రసం పీల్చడం వల్ల పైరు సుడులుగా ఎండిపోతుంది. పిలక దశలో దుబ్బకి 10-15 దోమలు పూత దశలో దుబ్బుకి 20నుంచి 25 దోమలున్నప్పుడు ఎసిఫేట్‌ 1.5గ్రా మోనోక్రోటోఫాస్‌ 2.2 మి.లీ లేదా ఇధోఫెన్‌ప్రాక్స్‌ 2.0 మి.లీ లేదా బ్యూప్రోఫెజిన్‌ 1.6 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్‌, ఎధిప్రోల్‌ 0.25గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత
గొంగళి పురుగు ఆకుల రెండు అంచులు కలిపి లోపలి నుంచే ఆకుపచ్చని పదార్ధాన్ని తినివేయడం వల్ల ఆకులు తెల్లబడి ఎండిపోతాయి. దుబ్బుకి ఒకటి లేదా రెండు పురుగులు సోకిన ఆకులున్నట్లయితే ఎసిఫేట్‌ 1.5గ్రా. కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 2.0 గ్రా. లేదా క్లోరాన్ట్రానిలిప్రోల్‌ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకునల్లి-కంకినల్లి: ఆకునల్లి ఆశించినప్పుడు ఆకులలోని పత్రహరి తాన్ని గోకి తినివేయడం వల్ల ఆకులుపాలిపోయి తెల్లని పిండి ఏర్పడు తుంది. కంకినిల్లి వెన్ను అభివృద్ధి చెందేదశలో అండాశయాన్ని, పుప్పొడిని నష్టపర్చుట వల్ల తాలుగింజలు ఏర్పడుతాయి. ఈ పురుగును తొందరగా గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నష్టాన్ని తగ్గించవచ్చు. ఆకునల్లి నివారణకు నీటిలోకరిగే గంధకం 3.గ్రా. లేదా డైకోఫాల్‌ 5. మి.లీ స్పైరోమెసిఫెన్‌ 1.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కంకినల్లి నివారణకు ప్రొఫెనోఫాస్‌2 మి.లీ, ప్రొపికోనజోల్‌1. మి.లీ లేదా డైకోపాల్‌ 5మి.లీ లీటరు నీటికి కలిపి అంకురం దశలో ఒకసారి, 15 రోజుల తర్వాత మరోసారి పై మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
తెగుళ్లు : అగ్గితెగులు ఆకులపై నూలుకండె ఆకారంలో గల గోధుమ రంగు మచ్చలు ఏర్పడి చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోతాయి. తగులబడినట్లు కనిపిస్తాయి. పైరు పూత దశలో ఉన్నప్పుడు వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు ఆశిస్తే మెడ ఇరిగి తాలుగింజలు ఏర్పడతాయి. అగ్గితెగులును తట్టుకునే రకం సాగుచేయుట, తెగులు కనిపించిన వెంటనే ట్రైక్లోజోల్‌ 0.6 గ్రా. లేదా ఐసోప్రాథయేలేన్‌ 1.5మి.లీ లేదా కాసుగామైసిన్‌ 2.5మి.లీ ఒక లీటరు నీటిలో కలపి పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఎండాకు తెగులు : ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ప్రారంభమై చివరకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తెగులు తట్టుకునే రకం సాగు చేయుట, సిఫారసు చేసిన నత్రజని ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేయాలి. చివరి దశవరకు ఆశిస్తుంది. మొక్కల కిందిబాగాన ఆకులపై గోధుమ రంగు కలిగిన మచ్చలు ఏర్పడి క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మచ్చలు పోట్ట వరకు వ్యాపించి పైరు పూర్తిగా ఎండిపోతుంది.
నివారణకు ప్రొఫికొనజోల్‌ 1.మి.లీ లేదా హెక్సాకొజోల్‌ 2.మి.లీ లేదా వాలిడామైసిన్‌ 2.మి.లీ లేదా లీటరు నీటికి కలిపి పొలంలో నీరు తీసేసి మొదలు దగ్గర బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

ఖరీఫ్‌లో వరి విత్తే సమయం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
ఎరువుల వాడుక సామర్థ్యం పెంచే సూచనలు
అధిక దిగుబడికి ఆర్‌ఎన్‌ఆర్‌
కొర్రల సాగు...
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:36 PM

టాటూలతో జవాన్లకు నివాళి

09:35 PM

పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్

09:27 PM

రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

09:25 PM

నర్సు సహకారంతోనే శిశువు అపహరణ

09:09 PM

లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌

09:06 PM

రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

08:55 PM

పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం..పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

08:45 PM

రూ.298 ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్

08:41 PM

64 జిలెటిన్ స్టిక్స్,49 డిటోనేటర్ లు స్వాధీనం

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.