Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు
  • విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.
  • 'మురారి' ఫేమ్ దీక్షితులు మృతి
  • ప్రభుత్వానికి రూ.28వేల కోట్లు..!
  • తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన కమల్‌హాసన్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
చేపలు- రొయ్యల పెంపకం | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • Sep 20,2018

చేపలు- రొయ్యల పెంపకం

మంచినీటి సరస్సులు, చెరువులు చేపల పెంపకానికి అనువుగా ఉంటాయి. చేపలేకాక మంచినీటి చెరువుల్లో రొయ్యలు పెంపకం కూడా బహుజనాదరణ పొందింది. రొయ్యల ఉత్పత్తి మొత్తం దాదాపు ఎగుమతి కావడం వల్ల మన రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది.
చేపల చెరువుల నిర్మాణానికి రుణ సదుపాయం
కొన్ని జాతీయ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు చేపలు, రొయ్యల చెరువుల నిర్మాణానికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందజేస్తున్నాయి. స్వల్పకాలిక పంట రుణాలను కూడా ఇస్తున్నాయి. చిన్న,సన్నకారు రైతులకు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఫిష్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ ఎజెన్సీలు, వెనుకబడిన జాతుల, తరగతుల సంస్థ కొంత పరిమితికి లోబడి చేపలు, రొయ్యల పెంపకానికి సబ్సిడీ, మార్జిన్‌ మనీ అందజేస్తున్నాయి. ఇప్పుడు మంచి నీటి రొయ్యల పెంపకానికి సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ కూడా సబ్సిడీ ఇస్తోంది.
చేపల చెరువు నిర్మాణానికి కావాల్సిన స్థలం
సారవంతమైన నేలను చెరువు నిర్మాణానికి ఎన్నుకోవాలి. సాధారణంగా వ్యవసాయానికి యోగ్యమైన నేలలన్నీ చేపల పెంపకానికి అనువైనవే. నేలకు నీటిని పట్టిఉంచే గుణం ఉండాలి. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, కొంత శాతం ఇసుక కలిసిన ఒండ్రు నేలలు, గరప నేలలు చేపల పెంపకానికి మిక్కిలి అనుకూలమైనవి. చెరువుకు సంవత్సరం పొడవునా తగిన పరిమాణంలో నాణ్యతగా నీటిని అందించే జలవనరులుండాలి. అనుబంధా హారం, ఎరువులు, మొదలైన వాటిని చెరువు దగ్గరకు రవాణా చేయడానికి, ఉత్పత్తి అయిన చేపలను మార్కెట్‌కు చేరవేయడానికి, అన్ని కాలల్లోనూ ఉపయోగపడే రహదారి సౌకర్యముండాలి. తక్కువ ఖర్చుతో నీటి యాజమాన్యం చేయడానికి, దొంగతనాలు జరగకుండా ఉండ డానికి విద్యుత్‌ సరఫరా ఉంటే మంచిది. తరచుగా వరదలకు, తుఫానులకు గురయ్యే ప్రాంతంగా ఉండకూడదు. చెరువుకు నీరు సరఫరా చేసే జలవనరులు అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.
చేపల చెరువును నిర్మించే విధానం
సమర్ధవంతమైన యాజమాన్యానికి, స్వయం సమృద్ధికి ఏ చేపల క్షేత్రమైనా మూడు విధాలైన చేపల చెరువులను కలిగి ఉండాలి.
1. చేప నారుమడులు (నర్సరీ చెరువు): చిచ్చురు చేప దశనుండి చిరుచేప దశవరకు పెంచడానికి.
2. చేప పిల్లలను పెంచే చెరువులు (రేరింగ్‌ చెరువు): చిరు చేప దశ నుండి పెద్ద చేప పిల్ల దశవరకు పెంచడానికి.
3. పెద్ద చేపలను పెంచే చెరువులు (స్టాకింగ్‌ చెరువు): పెద్ద చేప పిల్లల దశనుండి మార్కెట్‌ సైజు వరకు పెంచడానికి.
పెద్ద చేపలను పెంచే చెరువు నిర్మాణం: స్టాకింగ్‌ చెరువు చేపల క్షేత్రంలో అతి ముఖ్యమైనది. ఈ చెరువును రెండు రకాలుగా నిర్మించవచ్చు.
1. చెరువు నిర్మించాల్సిన ప్రదేశం చుట్టూర ఒక ట్రెంచ్‌ తవ్వి వచ్చిన మట్టిని గట్ల నిర్మాణానికి ఉపయోగించడం.దీన్ని ట్రెంచ్‌ పద్ధతి అంటారు.
2. చెరువు నిర్మించాల్సిన ప్రదేశం అంతా కొంత లోతున తవ్వి వచ్చి మట్టితో చుట్టూ గట్లు నిర్మించడం, దీన్ని 'సాసర్‌' పద్ధతిలో నిర్మించిన చెరువు అంటారు.
ట్రెంచ్‌ పద్ధతి చెరువుకు నిర్మాణం ఖర్చు తక్కువ. స్టాకింగ్‌ చెరువు 2 నుండి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. రెండెకరాల కంటే చిన్న చెరువు లాభదాయకం కాదు. 10 ఎకరాల కంటే పెద్ద చెరువుల యాజ మాన్యం కష్టం. చేపల చెరువులో మూడు ముఖ్య భాగాలున్నాయి. అవి 1 చెరువు అడుగు భాగం, 2 చెరువు గట్లు, 3 లోపలికి నీరు తీసుకునే ద్వారం (ఇన్‌లెట్‌) మురుగు నీరు బయటకు పంపే ద్వారం (అవుట్‌లెట్‌).
చెరువు యాజమాన్యం
1. పెంపకానికి చెరువును సిద్ధపరిచే విధానం: చేప పిల్లలను విడుదల చేసే ముందు చెరువులోని నీటిని మొత్తం తీసివేసి చెరువును ఎండబెట్టాలి. మాంసాహార, కలుపు చేపలను పూర్తిగా నిర్మూలించాలి. చేప పిల్లలను విడుదల చేయడానికి వారం రోజుల ముందు మొదట విడత సున్నం, ఎరువు చల్లినీరు వదలాలి. అనవసర జాతి చేపలు,మాంసాహార చేపలు లోనికి రాకుండా ఇన్‌లెట్‌కు మెష్‌ అమర్చాలి. చెరువులో 6 నుండి 8 అడుగులలోతు వరకు నీటిని నింపాలి. చెరువులో నీరు మూడు అడుగుల కంటే తక్కువ లోతు ఉంటే త్వరగా వేడి ఎక్కడం, కలుపు మొక్కలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపలకు సహజసిద్దంగా లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గిపోతుంది.
2. మంచినీటి చేపలు, రొయ్యల మిశ్రమ పెంపక విధానం
సాధారణంగా మంచినీటిలో పెంచబడే ఇండియన్‌ మేజర్‌ కార్స్‌జాతి చేపలు, బొచ్చె, రగండి, మోసులతో పాటు ఏటిరొయ్యని (మాక్రో బ్రేఖియం మాల్యమ్‌ సోని), నీలకంఠ రొయ్య (మాక్రోబ్రేఖియం రోజన్‌బెర్గి)లను పెంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి చెందిన మత్స్య విజ్ఞాన శాస్త్రశాఖకు చెందిన హేచరీలోను, ప్రయివేటు హేచరీలు నీలకంఠ రొయ్య విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రకృతిలో రొయ్య విత్తనాన్ని సేకరించినప్పుడు ఈ రెండు రకాల రొయ్య విత్తనాలతోపాటు స్కేబ్రిక్యులమ్‌ (తేలురొయ్య), లామెరై (గోంగూర రొయ్య)ల వంటి అనవసర జాతి రొయ్యల విత్తనం కూడా కలిసి ఉంటుంది. రొయ్యపిల్ల ముక్కు ఆకారాన్ని పొడవును దానిపైనున్న కంటకాల సంఖ్యనుబట్టి వేర్వేరు జాతుల రొయ్యలను గుర్తించవచ్చు. ఏటి రొయ్య ముక్కు పొడవుగా ఉండి పై అంచున 9నుంచి 11 కంటకాలను కలిగి ఉంటుంది. నీలకంఠ రొయ్య ముక్కు పొడవుగా ఉండి మధ్యలో పెద్ద ఒంపును కలిగి ఉంటుంది. ఇది పై అంచున 11నుంచి 14 కంటకాలను కలిగి ఉంటుంది. తేలురొయ్య ముక్కు పొట్టిగా ఉండి పై అంచున 13 వరకు కంటకాలను కలిగి ఉంటుంది. గోంగూర రొయ్య ముక్కు పొడవుగా ఉన్న 5నుంచి 7 కంటకాలను మాత్రమే కలిగి ఉంటుంది. రొయ్య విత్తనాన్ని చెరువులోకి వదిలే ముందు నేరుగా కాకుండా స్థానిక జలాలకు క్రమంగా అలవాటు చేసి వదలాలి. చురుకుగా ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే ఎన్నుకోవాలి. రొయ్య సర్వభక్షకి. చెరువులో లభ్యమయ్యే జంతు,వృక్ష సంబంధమైన ఆహార పదార్ధాలను తింటుంది. విడుదల చేసిన తరువాత 4నుండి 6 నెలల్లో రొయ్యలు మార్కెట్‌ సైజుకి పెరుగుతాయి. మిశ్రమ పెంపకంలో చేపలకు ఇచ్చే ఆహారాన్ని రొయ్యలకు కూడా కొంత పరిమాణంలో పెంచి ఇవ్వవచ్చు.
3. ట్రయిల్‌ నెట్టింగ్‌ ఆవశ్యకత:
ప్రతి 15 రోజులకొకసారి ట్రయిల్‌ నెట్టింగ్‌ వేసి చేపల పెరుగుదలను,ఆరోగ్యాన్ని అంచనా వేయాలి. చేపల సగటు పెరుగుదలను అంచనావేసి అందుకు తగ్గట్టుగా అనుబంధాహారం పరిమాణాన్ని పెంచాలి. వ్యాధులు, పరాన్న జీవులు ఏమైనా ఉన్నట్టయితే అందుకు తగిన నివారణ, చికిత్స చర్యలను తీసుకోవాలి.
4. చెరువు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెరువుల్లో ఎప్పుడు తగినంత లోతునీరు ఉండాలి. చెరువుల్లో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. చెరువులో ఆకుపచ్చ లేక ముదురు, గోధుమరంగు లేక ఇటుక రంగు, అల్గర్‌బ్లూమ్స్‌ ఏర్పడినప్పుడు ఎప్పటికపుడు తొలగిస్తుండాలి. చెరువు నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు తగ్గి పోవడమ నేది సాధారణంగా ఏర్పడే ప్రమాదకరమైన పరిస్థితి.దీంతో చేపలన్నీ ఒకేసారి చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా వేసవికాలం తెల్లవారుజామున లేక వర్షాకాలంలో మబ్బులు పట్టిన రోజుల్లోనూ కరిగిఉన్న ప్రాణవాయువు శాతం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. ఈ సమయంలో చేపలన్నీ నీటి ఉపరితలానికి వచ్చి నోటితో గాలి పీల్చుకుంటాయి. ఈ పరిస్థితిలో అనుబంధాహారాన్ని ఇవ్వడం, ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపి వేయాలి. వీలుంటే కొంత నీరు తీసివేసి కొత్త నీరుపెట్టాలి. చేపలను తినే పక్షులు, తాబేళ్లు, పాములు, నీటి పిల్లులను చెరువు నుంచి తొలగించాలి.
చేపల పట్టుబడి
చేపలను ఏ సైజుకు పెంచి అమ్మాలి అనేది అక్కడ అమ్మే మార్కెట్‌ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణ స్టాకింగ్‌ సాధ్రతతో కిలో సైజు పెరగడానికి 10నుంచి12 నెలలు పడుతుంది. ఇంకా పెద్ద సైజు చేపలకు మార్కెట్‌ డిమాండ్‌ ఉంటే సాంధ్రత తగ్గించాలి.మార్కెట్‌ సైజుకు ఎదిగిన చేపలను ఎప్పటికప్పుడు పట్టి వేయడాన్ని పాక్షిక పట్టుబడి అంటారు. పెద్ద చేపలను తీసివేసిన తర్వాత చిన్న చేపలు తొందరగా పెరుగుతాయి.
చేపలను నిల్వ చేసి, రవాణ చేయడం
చేపలను నీటిలో నుండి తీసిన తరువాత అతి త్వరగా చెడిపోతాయి. కనుక పట్టుబడి అయిన వెంటనే చేపలను స్వచ్ఛమైన నీటిలో కడిగి ప్యాక్‌ చేయాలి. దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి చేపలను ఐస్‌తో ప్యాక్‌ చేయాలి. వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్టలతో చేపలను, పొడి చేసిన ఐస్‌ను ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చి బుట్ట మూతిని కప్పి తాడుతో కట్టివేయాలి. ఈ పద్ధతిలో చేపలను తాజాగా 48 గంటల వరకు రవాణా చేయవచ్చు. ఇంకా దూర ప్రాంతాలకు రవాణ చేయాలంటే మధ్యలో తిరిగి ప్యాకింగ్‌ చేయాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ జి. విద్యాసాగర్‌రెడ్డి
సీనియర్‌ శాస్త్రవేత్త
మత్స్య పరిశోధనా స్థానం, పాలేరు
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం

చేపలు- రొయ్యల పెంపకం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
ఎరువుల వాడుక సామర్థ్యం పెంచే సూచనలు
అధిక దిగుబడికి ఆర్‌ఎన్‌ఆర్‌
కొర్రల సాగు...
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

09:22 PM

ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు

09:09 PM

విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.

09:06 PM

'మురారి' ఫేమ్ దీక్షితులు మృతి

08:50 PM

ప్రభుత్వానికి రూ.28వేల కోట్లు..!

08:38 PM

తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన కమల్‌హాసన్‌

08:25 PM

22న తిరుపతికి రాహుల్ గాంధీ

08:12 PM

నగరంలో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం

07:54 PM

మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు: మధులిక వాంగ్మూలం

07:52 PM

మంత్రుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్‌

07:42 PM

మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.