Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వార్షలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 -35డిగ్రీల సెల్సియస, రాత్రి ఉష్ణోగ్రతలు 22 -29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 18నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
రైతులకు సూచనలు
నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 40 నుంచి 45 రోజులు, 60నుంచి 65 రోజుల పత్తిపైరుకు పైపాటుగా ఎకరానికి 30నుంచి 35కిలోల యూరియా, 10కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వేసుకోవాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కజొన్న విత్తిన 25-30 రోజులకు పైపాటుగా ఎకరానికి 45-50కిలోల యూరియా, పూత దశలో ఉన్న పైరుకు ఎకరానికి 45నుంచి 50కిలోల యూరియా, 30నుంచి 35కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి వర్షాధార పంటలలో తరచుగా అంతర కృషి చేసి కలుపు నివారించి నేలలోని తేమను సంరక్షించుకోవాలి.
వరి
ప్రస్తుత వాతవరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి ఆశించడమైనది. నివారణకు 3గ్రా.నీటిలో కరిగే గంధకం లేదా 5మి.లీ డైకోఫాల్ లేదా 2 మి.లీ ప్రొఫెనోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యురాన 3జి గుళికలను 200చ.మి నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి.
పత్తి
పత్తిలో రసం పీల్చే పురుగులను నివారించేందుకు మోనోక్రోటో ఫాస్ మందు, నీటిని1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్‌తో విత్తిన 20,40, 60 రోజులకు పూయాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఎర్ర చల్కనేలల్లో ్ల సాగు చేసిన పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడ వల్ల మొక్కలు సరిగా ఎదగక ఆకులు పాలిపోయి క్రమేణా ఎండిపోవడం గమనిం చడమైది. నివారణకు 1గ్రా. కార్బండజిమ్ లేదా 3గ్రా. కాపర్ - ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ 12శాతం, మాంకోజెట్ 63శాతం(సాఫ్)మందును లీటరు నీటిలో కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్లు చల్లాలి.
సోయచిక్కుడు : కాండం లొలిచే ఈగ గమనించడమైంది. నివారణకు 1.0గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మాక్రోఫోమిన వేరుకుళ్లు తెగులు సోకడం గమనించడమైనది. నివారణకు 1గ్రా. కార్బొండజిమ్ మందును లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్లు చల్లాఇ. కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 3కి.కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను మొవ్వులో వేసుకోవాలి.
కూరగాయలు : బెండలో బూడిద తెగులు, ఎర్రనల్లి గమనించ డమైనది. నివారణకు 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1.మి.లీ క్యాలిక్జిన్ మందును లీటరు నీటికికలిపి పిచికారీ చేయాలి. టమాటలో ఆకుమాడు తెగులు, టోబాకో మోజాయిక్ వైరస్ తెగులును గమనించడమైనది. నివారణకు ఆకుమాడు తెగులుకైతే 2 గ్రా. కార్బండజిమ్ 12 శాతం, మాంకోజెట్ 63శాతం డబ్ల్యూపీ లేదా 2 గ్రా. మెటలాక్సిల్, మాంకోజెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ, కాయతొల్చు పురుగును గమనించడమైంది. నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
టోబాకోమోజాయిక్ వైరస్ తెగులుకైతే 2 మి.లీ.ఫిప్రోనిల్ లేదా 2.మి.లీ డైమిథోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2మి.లీ ప్రోఫెనోఫాస్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టమాట, వంగ, మిరప నారుమడుల యాజమాన్యంలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లు ఆశించకుండా విత్తనాలను 3గ్రా.థైరామ్ మందును కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసిన తరువాత జీవ శీలింధ్రనాశిని అయిన ట్రైకోడెర్మ విరిడె మందును కిలో విత్తనానికి 8గ్రా. చొప్పున కలిపి నారుపోసుకోవాలి. టమాట, వంగ పంటల్లో రసంపీల్చే పురుగుల నివారణకు 2.మి.లీ డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో దుంప కూరగాయలలో (చేమ, కంద) సూక్ష్మధాతు లోపాలు గమనించడమైనది. నివారణకు సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.