Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. నేను కర్ణాటకలో టిటిసి చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకూ చదివింది మొత్తం తెలుగు మీడియంలో టిటిసి మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదివితే ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? కర్ణాటకలో చేసే టిటిసితో తెలంగాణలో డీఎస్సీ రాసుకునే అవకాశం ఉందా? లేదా? తెలుపగలరు.
-అమీత్, నిజామాబాద్, 9154973386.
జ.కర్ణాటకలో టిటిసి చేసినందు వల్ల ఇబ్బందిలేదు. అయితే టిటిసి కళాశాలకు ఎన్‌సిటిఇ గుర్తింపు ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్‌సి రాసుకునే అవకాశం ఇస్తారు.
2. నేను డీఎస్సీ 1998లో కాల్విఫైడ్ అయ్యాను. అయితే 1998 డీఎస్సీ కేసు సుప్రీం కోర్టులో వుంది. ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉందా? లేదా? ఉంటే ఏ జి.ఓ ప్రకారం తెలుపగలరు.
- శ్రీనివాస్, కరీంనగర్, 8019811927.
జ.1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ వారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే ఉద్యోగాల భర్తీ విషయం తేలుతుంది. ముందుగా భర్తీ చేసేందుకు జి.ఓ.లు ఏమీలేవు.
3. నా క్వాలిఫికేషన్ బి.ఎస్‌సి, బి.ఇడి 2007లో అయి పోయింది. నేను బి.ఇడిలో బయోసైన్స్, తెలుగు తీసుకున్నాను. తెలంగాణ టెట్‌లో రెండవ పేపర్‌లో మ్యాథ్స్, సైన్స్ నుండి సోషల్, తెలుగు రాసుకోవచ్చా? తెలుగు పండిత్‌గా ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలా? ఓపెన్ కేటగిరిలో టెట్ స్పెషల్ ఎంచుకునే అవకాశం ఉందా? లేదా? తెలుపగలరు.
-జగన్ మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్.
జ. ప్రస్తుతసర్వీసు నిబంధనల ప్రకారం డిగ్రీలో తెలుగు ఒక ఆప్షనల్‌గా చదివి ఉంటే లేదా ఎం.ఎ. (తెలుగు) అర్హత కలిగి పండిట్ ట్రైనింగ్ లేదా బి.ఇడిలో తెలుగు మెథడాలజీ ఉంటే టెట్ లో తెలుగు పండిట్ కొరకు వ్రాసుకోవచ్చు. డిఎస్‌సిలో తెలుగు పండిట్ ఉద్యోగానికి అర్హులు.
పశ్న: ప్రభుత్వ ఉద్యోగాలకు ఓపెన్ డిగ్రీ పనికి వస్తుందా? లేదా తెలుపగలరు.
మిట్టు, హైదరాబాద్, 9948794051.
జ. ఓపెన్ డిగ్రీ అన్నీ విధాలుగా రెగ్యులర్ డిగ్రీతో సమానం కనుక ప్రభుత్వ ఉద్యోగాలకు పనికివస్తుంది.
-సి.హెచ్. రవి, ప్రధానకార్యదర్శిTSUTF
1. నేను విఆర్‌ఓగా 2014వ సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నేను గ్రూప్-2 పరీక్షల కోసం చదువుకోవడానికి లాంగ్ లీవ్ తీసుకునే అవకాశం ఉందా? లేదా? లాంగ్ లీవ్ తీసుకోవడానికి కారణం ఏం చూపి తీసుకోవాలి. జీతనష్టపు సెలవు వచ్చే అవకాశం ఉందా? లేదా? ఉంటే ఏ విధంగా తెలుపగలరు. జీతనష్టపు సెలవు కాకుండా ఇంకా ఏదైనా సెలవు పెట్టుకునే అవకాశం ఉందా?లేదా?
శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా, 9866990833.
జ. టీచర్లకు తప్ప పైచదువులకోసం ఇతర ప్రభుత్వోదోగులను లాంగ్‌లీవ్ అవకాశం లేదు. జీతం నష్టం మీద సిక్ లీవ్ పెట్టుకోవడమే.
2. మా నాన్నగారు 6 సంవత్సరాలు హెడ్‌కానిస్టెబుల్‌గా సర్వీసు పూర్తి చేసుకున్నారు. 6 సంవత్సరాలు హెడ్‌కానిస్టెబుల్‌గా సర్వీసు పూర్తి చేసుకున్నా వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఒక ఇంక్రిమెంట్ అయినా రావాలి కానీ అది కూడా ఇవ్వలేదు. 21 సంవత్సరాల ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకు అంటే సమయం మించి పోయింది అంటున్నారు. ఇది సరైనాదేనా?
శ్రీకాంత్ రంగారెడ్డి, 9866990833.
జ. పోలిసు డిపార్ట్‌మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి సం|| ఇంక్రిమెంట్ రావల్సిందే ఏదైనా పనిష్‌మెంట్ కేసు పెండింగ్ ఉందేమో తెలసుకోండి ఏ సమస్యా లేకున్నా ఇటువంటి వేధింపులు ఉంటే ముందు మీ జిల్లా ఎస్.పి.గారికి మీ తండ్రిగారే ఇక విన్నపం ఇవ్వమనండి.అప్పటికి కాకుంటే అడ్మిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కివెళ్ళమనండి.
3. నేను ఒక కాటన్ ఫ్యాక్టరిలో 1985 నుండి అటెండర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. అయితే జూలై 2010 లో జిల్లా కార్యలయానికి బదిలి చేశారు. ఇ.ఎల్, సిఎల్, మెడికల్ క్లాయిమ్ ఇస్తున్నారు. కానీ కాటన్ ఫ్యాక్టరిలో ఇచ్చే అలవెన్సు ఇవ్వడం లేదు. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో 2010 జూలై నుండి పర్మినెంట్ అర్డరు ఇస్తాము అన్నాను కానీ ఇవ్వలేదు. రోజూవారి కూలి కింద జీతం ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసులో పని చేసే వారిని నేరుగా అటెండర్ తీసుకున్నారు. వాళ్ల క్వాలిఫికేషన్ 10వ తరగతి మాత్రమే నా క్వాలిఫికేషన్ డిగ్రీ అయినా నన్ను పర్మినెంట్ చేయడం లేదు. నాతో పాటుగా బి.సి. ఓ.సి, మైనార్టీటి తరగతికి చెందిన వారిని ఎవరిని కూడా పర్మినెంట్ చేయడం లేదు. మామ్మల్ని ముందుగా ఎంఎన్‌ఆర్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఎంఎన్‌ఆర్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నా వారిని పర్మినెంట్ చేసే అవకాశం ఉందా? లేదా?
వి. విఠల్, ఆదిలాబాద్, 9603559832.
జ. మీ ప్రశ్నల్ని బట్టి మీరు ప్రభుత్వంతో సంబంధమున్న డిపార్ట్‌మెంట్‌లో వున్నారని తెలుస్తున్నది. 1985 నుండి మీరు ఎన్.ఎమ్.ఆర్.గా వున్నట్లేతే జివో 212 ప్రకారం మీరు పర్మినెంట్ అయ్యే అన్ని అవకాశాలు వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ ఫెడరేషన్ నాయకులతో సంప్రదించండి.
-ఆర్. సుధాభాస్కర్
CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు,