Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు.
- మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును చుండ్రు నుంచి కాపాడుతాయి.
- మందార పువ్వుల్లో విటమిన్ ఎ, సి, అమినో యాసిడ్లు పుష్కలంగా వున్నాయి.
- మందార ఆకులు.. జుట్టుకు సౌందర్యాన్నిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది.
- ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే.. జుట్టు దట్టంగా తయారవుతుంది.
- మందార పువ్వులు లేదా ఆకులకు పెరుగు లేదా మెంతులుతో కలిపి పేస్టుగా చేసుకుని జుట్టుకు పట్టించాలి.
- రోజ్ మేరీ ఆయిల్, పెరుగు నాలుగు టీ స్పూన్లు, మందార పువ్వులు తీసుకుని పేస్టులా చేసుకుని జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. ఈ పేస్టును మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే జుట్టు మెరిసిపోతుంది.