Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర కప్పు ఆలూ పేస్ట్‌ను మూడొంతుల కప్పు దోసకాయ పేస్ట్‌తో కలిపి ముఖానికి రాసుకుని ముఖం మీద ఉన్న ధూళి అంతా తొలగిపోతుంది. ఇది చర్మానికి రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
- ఆలూలో కేలరీలు, పొటాషియం, విటమిన్ సి, మినరల్ లవణాలు, పిండి పదార్ధాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
- కంటిశుక్లం ఉంటే ఆలూ మీకు ఉపశమనం ఇస్తుంది. అలాగే కండ్ల కింద వాపును ఆలూ తగ్గిస్తుంది
- ఆలూను గ్రైండ్ చేసి రసం తీయండి. ఆ రసం కండ్ల చుట్టూ రుద్దండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే మంచిది.
- ఆలూ రసంలో అర టీ స్పూన్ నిమ్మరసం కలపండి. చెంచా తేనె వేసి ముఖం, మెడపై పూయండి. పది నిమిషాలు తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న ధూళి అంతా తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది ముఖం మీద అదనపు జిడ్డును కూడా తొలగిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది బాగా పని చేస్తుంది.
- ఆలూ పేస్ట్ జిడ్డు చర్మం వారు మాత్రమే కాకుండా పొడి చర్మం వారు కూడా ఉపయోగిస్తారు. ఆలూ ఉడకబెట్టి బాగా మాష్ చేయండి. చెంచా పాలపొడి, చెంచా బాదం నూనె వేసి పేస్ట్‌ను ముఖానికి రాయండి. సుమారు ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు. దాంతో చర్మం మదువుగా ఉంటుంది.