Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజ్‌మేరీ నూనెను చర్మానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోవటంతో పాటు కొత్త కణాల ఉత్పత్తికి సహయపడుతుంది. ఈ నూనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే ముఖం మీద ఉండే సన్నని గీతలను, మచ్చలను తొలగిస్తుంది.
దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మొటిమలను, ముడతలను దూరం చేస్తుంది. రోజ్ మేరి నూనె ముఖ్యంగా ముఖంపై బ్యాక్టీరియ వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తుంది.
ఇది కొల్లెజెన్ కణాల ఉత్పత్తి చేస్తుంది. అలాగే చర్మానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను విడుదల చేసి ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ముఖానికి ఈ నూనెను మర్దన చేసుకోవటం వల్ల చర్మ సమస్యలు దూరం కావటంతో పాటు ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
అలాగే ముఖం ఉబ్బి, నిర్జీవంగా కనిపిస్తే ఇలా చేయండి. రోజ్‌మేరీ నూనెలో నాలుగు చుక్కల కొబ్బరి నూనెను కలిపి ఉబ్బిన ప్రాంతంలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల తొందరంగా ఉపశమనం పొందుతారు.