Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన కడుపులో ఓ చిన్నారి పెరుగు తుందనే భావన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసు కోవాలని, ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి కాబోయే అమ్మ బలీయమైన ఆకాంక్ష. గర్భధారణ సమయంలోని తొమ్మిది నెలల కాలంలో అత్యుత్తమ డైట్ తీసుకోవడం వల్ల తను, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని తల్లి గుర్తించాలి.
గర్భాధారణ సమయంలో ఏకకణం ద్వారా రూపుదిద్దుకునే శిశువు 6 మిలియన్లకు పైగా కణాల సమూహంతో పూర్తి స్థాయిలో చిన్నారిగా ఎదుగుతుంది. ఇలా గర్భాధారణతో చిన్నారికి జన్మనిచ్చే సమయంలో ఆ మహిళ శరీరం అనేక శారీరక మార్పులకు గురి అవుతూ ఆ చిన్నారి ఎదుగుదలకు సహకరిస్తుంది. పిండం ఎదుగుదలకు తల్లి శ్లేష్మ స్రావం (మాయ) ఎదుగుదల అవుతుంది. శారీరక ఎదుగుదలకు సహకరిస్తూనే వారి అభివ ద్ధికి సహకరించేలా పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.
బిడ్డ ఎదుగుదలలో అనేక అంశాలు పోషకాహారంతోనే మిళితం అయి ఉంటాయి. తల్లి తీసుకునే సరైన పోషకాహార ప్రక్రియ బిడ్డ ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. గర్భాధారణ సమయంలో సరైన పోషకాహార తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం.
పాటించాల్సినవి..
1. కణజాలంలో వ ద్ధి, పిండం ఎదుగుదల, గర్భస్థ మావి ఎదుగుదల నేపథ్యంలో తీసుకోవాల్సిన పోషకపదార్థాల అవసరం ఎక్కువగా ఉంటుంది. రోజుకు 2175 కాలరీలు తీసుకోవాల్సి ఉండగా దీనికి అధనంగా మరో 300కు పైగా కాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలరీలు తీసుకోవడం అనేది బీ విటమిన్ల వంటి ఇతర పోషకాల ప్రయోజనాలను మరింతగా పెంచుతుంది. క్యాలరీల అవసరాలు మాత సంబంధిత పరిణామం, గర్బం దాల్చినప్పటికి ముందున్న పరిస్థితి, తీసుకున్న ఆహారం శారీరక శ్రమపై ఆధారపడి ఉంటాయి.
2. తల్లీ బిడ్డకు కావాల్సిన అమైనో యాసిడ్లు, నైట్రోజన్‌ను ప్రొటీన్ అందజేస్తుంది. రక్తం వ ద్ధి పెరగడం, గర్భాశయం, రొమ్ముకు సంబంధించిన ఆరోగ్యం కోసం కూడా ప్రోటీన్ కావాల్సి ఉంటుంది. స్థూలంగా 65 గ్రాముల ప్రొటీన్ రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. 3. రోజులో తీసుకునే 1000 మిల్లీ గ్రాముల కాల్షియంకు తోడుగా మరో 600కు పైగా గ్రాముల కాల్షియం కావాల్సి ఉంటుంది. బిడ్డ ఎదుగుదలను ద ష్టిలో ఉంచుకొని కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి.
4. రోజుకు 38 మిల్లీగ్రాములు ఐరన్ తీసుకోవాల్సి ఉండగా మరో 8 మిల్లీగ్రాములు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. పిండం ఎదుగుదల విషయంలో హార్మోన్ల సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఐరన్ అవసరం అవుతుంది.
5. 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ప్రతిరోజు కావాల్సి ఉండగా దీనికి తోడుగా 300 మైక్రోగ్రామలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భాధారణకు ముందు, గర్భం దాల్చిన మొదటి మూడు నెలల కాలం చాలా ముఖ్యమైనది. బిడ్డ మెదడు, వెన్నుముక ఎదిగే ఈ దశలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా గర్బిణీలందరూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలి.
డైట్..
పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లో తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, డ్రై ఫూట్స్ తినాలి. ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. వీటిని సాధ్యమైన వరకు తీసుకోవద్దు. రోజు తీసుకునే ఆహారానికి అదనంగా పొద్దున ఐదు బాదం పలుకులు, ఐదు తాజా ఖర్జూరాలు, కోడిగుడ్డు తీసుకోవాలి. 11 గంటల సమయంలో గ్లాసు పాలు, తాజా పండు ఒకటి తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనంతో వెజ్ సలాడ్, అన్నం, గ్రీన్ కర్రీస్, బట్టర్ మిల్క్ ఉండేలా చూసుకోవాలి. స్నాక్‌గా వెజ్ చీస్ శాండ్‌విచ్, జ్యూస్ తీసుకోవాలి.
డిన్నర్‌లో సూప్, కోడి గుడ్డు, రెండు పుల్కాలు, వెజ్ కర్రీ, ఫ్రూట్ సలాడ్ మొదలైనవి తీసుకోవాలి.
- డా|| కె. వేణుమాధవి,
డైటీషియన్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్,