Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చిన్నపిల్లలు మీరేం చేయగలరన్నారు... | మానవి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

చిన్నపిల్లలు మీరేం చేయగలరన్నారు...

ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే.. మనం అంతకన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉంటాం. అందుకే ఇంటి అలంకరణ కోసం ఎక్కువ ప్రాధాన్య మిస్తున్నారందరూ. చిన్న పట్టణాల నుంచి... నగరాల దాక కొత్త ఇల్లు కడితే.. కచ్చితంగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేయిస్తున్నారు. ఆర్కిటెక్చర్‌ చదువుకుని అక్క, ప్యాషన్‌తో చెల్లి 'ఆదికార' లేబుల్‌తో ఈ రంగంలో అడుగుపెట్టారు. సాధికారికంగా డిజైనింగ్‌రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే పెరిగిన తమ గ్రాఫ్‌ గురించి... లక్ష్మీ కాత్యాయని పంచుకున్న ముచ్చట్లు.
''నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న కె. రామశేషగిరి రావు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. నాకు మూడేండ్లప్పుడు మా అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయాక... నాన్నగారు మళ్లీ పెండ్లి చేసుకోలేదు. నాన్న, నాన్నమ్మ ధనలక్ష్మి అమ్మ లేని లోటు లేకుండా పెంచారు. మేం ఇద్దరమ్మాయిలమే. కొడుకు లేడన్న బాధ చాలా మందికి ఉంటుందేమో కానీ.. నాన్న ఎప్పుడూ ఆ వివక్ష మాపై చూపలేదు. కాలేజీ రోజుల నుంచి కూడా మాకు ఏనాడూ ఆంక్షలు పెట్టలేదు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పలేదు. మాకు ఇష్టం ఉన్నది చదివించారు. ఇష్టమున్న కెరీర్‌ను ఎంచుకోమన్నారు. కాకపోతే ఎక్కడయినా లేటయితే... ఇన్‌ఫామ్‌ చేయాలని చెప్పేవారు. కాలేజీ డేస్‌ నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఆ స్వేచ్ఛ ఇచ్చారు. దాన్ని ఎప్పుడూ మేం దుర్వినియోగం చేయలేదు. అక్క శ్రీభరణి హ్యామ్స్‌టెక్‌లో ఆర్కిటెక్చర్‌ చదివింది. నేను బీకామ్‌ చేశాను. కామర్స్‌ అయితే చదివాను కానీ... అక్క ఇంటీరియర్‌ డిజైనింగ్‌ను దగ్గరుండి గమనిస్తూ నేనూ ఆసక్తి పెంచుకున్నాను. అక్కతో పాటు సైట్స్‌కు వెళ్లేదాన్ని. అట్లా చాలా ఇళ్లకు వర్క్‌ చేశాం.
మలుపు తిప్పిన ప్రిన్స్‌ ఎస్రా...
2015లో మొఘల్‌పురాలోని అక్బరుద్దీన్‌ ఒవైసీ హాస్పిటల్‌... ప్రిన్సెస్‌ ఎస్రాలో సీసీటీవీ కెమెరాస్‌ ఫిట్టింగ్‌ కాంట్రాక్ట్‌ 2015 మా ఫ్రెండ్‌ వాళ్లు తీసుకున్నారు. అందులో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేయాల్సి ఉండి.. మమ్మల్ని రిఫర్‌ చేశారు. అట్లా మాకు అవకాశం వచ్చింది. ప్రజెంటేషన్‌ ఇచ్చాం. ఓ రోజు ఉదయమే వెళ్లాం ప్రజెంటేషన్‌కు. మమ్మల్ని చూసి... 'చిన్నపిల్లల్లా ఉన్నారు.. మీరెలా చేయగలరు?' అన్నారు. ఒక చిన్న అవకాశం ఇవ్వండి సర్‌... నచ్చితేనే కాంట్రాక్ట్‌ ఇవ్వండని చెప్పాం. అంతే మేం చేసిన వర్క్‌ నచ్చింది.అలా అవకాశం వచ్చింది. ఆస్పత్రి వర్క్‌ తరువాత వాళ్ల ఇంట్లో కూడా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేశాం. అది మా కెరీర్‌ను మలుపుతిప్పింది. నాకయితే ఇంటీరియర్‌లో పూర్తి స్థాయి అవగాహన, మా ఆదికారకు గుర్తింపు ఆ ప్రాజెక్ట్‌తోనే వచ్చింది. ఆ తరువాత వెను దిరిగి చూసుకోలేదు.. అట్లా ఒకరినుంచి మరొకరికి నోటి మాట ద్వారానే అవకాశాలు వచ్చాయి. యాడ్‌ పబ్లికేషన్స్‌, జస్ట్‌డయల్‌ ఏవీ చేయలేదు. ఆ తరువాత అనేక రెసిడెన్షియల్‌ ప్లేసెస్‌ చేశాం.
నిత్యం అప్‌డేట్‌ అవుతూ...
అయితే కేవలం ఇంటీరియర్‌ డిజైనింగ్‌తోనే ఆగిపోలేదు. మాదైన బ్రాండ్‌ వస్తువులుండాలని... బ్రాస్‌, సిల్వర్‌, యాంటిక్‌ లుక్‌తో వినూత్నమై ఇంటి అలంకరణ వస్తువులను డిజైన్‌ చేశాం. తాజ్‌కృష్ణలో 2017లో లాంఛ్‌ చేశాం. ఈ ఎగ్జిబిషన్ల డబ్బులొచ్చినా రాకపోయినా... మాలోని సృజనాత్మకత నలుగురికి తెలుసుంది. దాంతో అవకాశాలు పెరుగుతాయి. అలాగే జరిగింది. ఇప్పటిదాకా తాజ్‌కృష్ణా, తాజ్‌బంజారాలో అనేక ఎగ్జిబిషన్లు నిర్వహించాం. విపరీతమైన పోటీ ఉన్న ఈ రంగంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటీరియర్‌లో వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తాం. అలాగే మనదేశంలో, ప్రత్యేకించి మన హైదరాబాద్‌లో వస్తున్న ట్రెండ్స్‌ను గమనిస్తుంటాం. ఇప్పుడు ప్రపపంచం ఓ గ్రామమైపోయింది. అన్ని రకాల ఇంటీరియర్స్‌ అన్నిదేశాలకు విస్తరించాయి. దాంతో డిఫరెంట్‌గా కావాలని కోరుకుంటున్నారు క్లయింట్స్‌. ఇండోనేషియా, రష్యన్‌ టర్కీ, ఇటలీ వే ఆఫ్‌ పర్నీచర్‌ను నగర వాస్లుఉ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... జిల్లాల్లోనూ ప్రాజెక్టులను చేపడుతున్నాం. డీఎస్‌ఆర్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌తో కలిసి పనిచేశాం. ప్రస్తుతం... నగరంలోనే బెస్ట్‌ వెంచర్‌ అపర్ణా అపార్ట్‌మెంట్స్‌కి వర్క్‌ చేస్తున్నాం.
ఆహ్లాదాన్నివ్వాలి...
పేదా ధనికా తేడా లేకుండా... ప్రతి ఒక్కరు ఇంటికి రాగానే కోరుకునేది ప్రశాంతత. అది రావాలంటే.. చూసే రంగులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు... చిన్నపిల్లలు ఎరుపును ఇష్టపడతారు. అట్లా కొన్ని రంగులు మన కంటికి ప్రశాంతతనిస్తాయి. డిజైనింగ్‌ కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వడం ముఖ్యం. అట్లా రంగుల ఎంపిక... ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ డిజైన్‌ చేస్తాం. కొందరు వాస్తు నమ్ముతారు. కొందరు నమ్మరు. మేం అవేవీ కాకుండా... కాస్మిక్‌ ఎనర్జీ ఎక్కువగా ఉండే విధంగా చూస్తాం. ముఖ్యంగా ఇనుమను తగ్గించి.. మెటల్‌ బాడీస్‌ ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. వాటివల్ల కాస్మిక్‌ ఎనర్జీ వస్తుంది. ఎంతలో కావాలనేది క్లయింట్స్‌ బడ్జెట్‌ ఇస్తారు. వాళ్ల బడ్జెట్‌కు తగ్గట్టుగా డిజైన్‌ చేస్తాం. ఎకనామికల్‌, ప్రీమియమ్‌, లగ్జరీ కూడా ఇస్తాం. వాటిలో వాళ్లు ఎంచుకున్న రేంజ్‌ను బట్టి చేస్తాం. త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ను... ఆరేడు లక్షల నుంచి కూడా కోటి రూపాయలకు కూడా చేయొచ్చు.
మహిళలకు మంచి స్కోప్‌ ఉంది..
ఇష్టం ఉన్న రంగం కాబట్టి శ్రమ అస్సలు అనిపించదు. కొన్ని సార్లు లేటవర్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు... ఒకరికి గృహప్రవేశం అర్జెంట్‌ ఉండి రాత్రి రెండుగంటల దాకా ఉండి చేయాల్సి వచ్చింది. అయినా ఇబ్బంది పడలేదు. అక్కకు పెండ్లయ్యింది. బావగారు కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అలాంటి ఆడ్‌ టైమ్స్‌ను కూడా మేనేజ్‌ చేయగలుగుతాం. 2015లో ఈ కెరీర్‌లోకి వచ్చాను. కానీ పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేస్తున్నది 2016 నుంచే. అన్ని కెరీర్స్‌లో ఎత్తుపల్లాలున్నట్టే ఇందులోనూ ఉంటాయి. డబ్బులు సరైన సమయంలో రాకపోవడం వంటివి సమస్యలు ఉంటాయి. ఒక్కో సైట్‌లో ఒక్కో సమస్యను ఫేస్‌ చేశాం. మరోసారి అది పునరావృతమవ్వకుండా అగ్రిమెంట్‌లో పెట్టుకునేవాళ్లం. దీనివల్ల న్యాయపరమైన అవగాహన కూడా వచ్చింది. మనలను, మన ఇంటిని నీట్‌గా ప్రజెంట్‌ చేసుకోవడం ఓ కళ. ఆ కళ అమ్మాయిలకు బాగా తెలుస్తుంది. అలాంటి ఆర్టిస్టిక్‌ వర్క్‌ కాబట్టి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. ఒకప్పుడు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే... కార్పెంటరీ వర్క్‌ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్నది. హైదరాబాద్‌ ఈ మధ్యకాలంలో బాగా విస్తరిస్తున్నది కాబట్టి... మహిళలకు మంచి స్కోప్‌ ఉన్న రంగం. కావాల్సిందల్లా సృజనాత్మకతే. వరంగల్‌ జిల్లా పెంబర్తిలో వర్కింగ్‌ స్టూడియో ఉంది. మార్కెట్‌లో ఉన్నవి కాకుండా... విభిన్నమైన సోఫా లేదా ఓ పాట్‌ కావాలంటే.. స్కెచ్‌ గీసి డిజైన్‌ చేయిస్తార. ఈ రంగంలో రాణించాలంటే వినమ్రత అవసరం. మాట్లాడే పద్ధతి బాగుండాలి. అన్నింటికీ మించి ఆర్థికనిర్వహణ వచ్చి ఉండాలి''
- కట్ట కవిత

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అర్థం చేసుకుంటే సమస్యలేదు
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే
నడుముపై చేతివేస్తే..!
రాగులతో మేలైన ఆరోగ్యం
రోజంతా ఉత్సాహంగా...
మహిళలను చైతన్య పరచాలి
ఐరన్‌ ఎక్కువుండాలి...
మెహందీ తొలగించాలంటే
చుండ్రును తగ్గించే సహజ చిట్కాలు
కాన్ఫిడెన్స్‌ పెరగాలా?
రంగ వల్లులు
కొలెస్ట్రాల్‌కు చెక్‌
సమానత్వానికి ఇంకెన్నాళ్లు..!
సౌందర్యానికి కమలాలు
మెరిపించే నెయిల్‌ఆర్ట్‌
ఎప్పటికప్పుడు శుభ్రంగా
కెరటాలతో పోటీపడుతూ..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇవి తప్పనిసరిగా..!
వీటికీ కాలంచెల్లుతుంది!
అందాన్ని పెంచే గుడ్డు
G.M is useful in construction of index number
మస్లిన్‌ మాయ‌జాలం
రోజుకి ఐదు తింటే ఆరోగ్యమే..
పెంచడం తేలికే!
సృజనాత్మక ప్రక్రియ
మహిళా గ్యారేజ్‌...
ఈ ఆహారంతో మలబద్ధకం దూరం
అబ్బాయిలకు జాగ్రత్తలు చెప్పాలి...
బాదంతో ఆరోగ్యం

తాజా వార్తలు

11:08 PM

ఉపాధి హామీలో సిరిసిల్ల టాప్

11:04 PM

వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణం

10:00 PM

రాజు రవితేజ అభిప్రాయాలను గౌరవిస్తున్నాం: పవన్‌

09:58 PM

ఐఫోన్‌కు ఆర్డరిస్తే.. నకిలీ ఫోన్ డెలివరీ

09:47 PM

వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

09:44 PM

జనసేనకు గుడ్‌బై చెప్పిన రాజు రవితేజ

09:37 PM

ఎట్టకేలకు పీవీ సింధుకు ఓ గెలుపు

09:30 PM

ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర: మంత్రి సత్యవతి

09:26 PM

ఏపీఎస్సార్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కంటే డీజిల్ బస్సులే మేలు...

09:22 PM

ప్రభుత్వం విఫలమైంది: హర్షవర్ధన్ రెడ్డి

09:01 PM

నిజాలు ఒప్పుకోక తప్పలేదు: విజయశాంతి

08:53 PM

వివేకా హత్య కేసు.. హైకోర్టులో పిటిషన్ వేసిన బీటెక్ రవి

08:50 PM

బాసర ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ అవార్డు

08:40 PM

రోడ్డుపై పడ్డ ఉల్లిగడ్డలు..ఎగబడ్డ జనం

08:26 PM

ఏయూ గొప్ప మేధావులను అందించింది: జగన్‌

08:10 PM

భార్య కోసం కుర్చీలా మారిన భ‌ర్త‌

07:58 PM

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు

07:34 PM

చంద్రబాబును అడ్డుకోవడం దురదృష్టకరం: కళా

07:22 PM

ఢిల్లీలోనూ పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు

07:15 PM

జనవరి 2 నుంచి రెండో దశ పల్లె ప్రగతి: ఎర్రబెల్లి

07:09 PM

ఆత్మహత్యలతో తెలంగాణ పరువు పోయింది: ఉత్తమ్‌

06:58 PM

అసోంలో ఆందోళనలు.. 3కు చేరిన మృతులు

06:44 PM

పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం

06:16 PM

మూడు రోజులు వణికించిన చిరుత.. చివరికి చిక్కింది

06:03 PM

వైసీపీ మద్దతుదారుల దుష్ప్రచారం: పవన్‌

06:00 PM

ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు

05:54 PM

23నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

05:49 PM

రాజధాని మార్చే ఉద్దేశం లేదు: బొత్స

05:39 PM

స్పీకర్‌కు బాధ్యత లేదు.. సీఎంకి అనుభవం లేదు: బాబు

05:30 PM

అమిత్ షా షిల్లాంగ్‌ పర్యటన రద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.