Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నచిన్న విషయాలే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెంచుతాయి. కానీ ఇలా మనస్పర్థలు ఎదురైనప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు, అనే ఆలోచనతో మౌనంగా ఉండటం కూడా పొరపాటే అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తున్నారంటే భార్యాభర్తలు సమస్యల్ని వాయిదా వేస్తున్నారని అర్థం. ఇది క్రమంగా అసంతప్తికి దారి తీస్తుంది. అనుబంధంపైనా ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న మనస్పర్థలు వస్తే తప్పనిసరిగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి.
- భార్యాభర్తల అభిరుచులు వేరువేరుగా ఉండవచ్చు, లేదంటే ఒకేలా ఉండవచ్చు. అందుకే ఇద్దరికి నచ్చనివి కాకుండా నచ్చే అంశాలపై దష్టి పెట్టాలి. అలాంటివి కలిసి చేసుకుంటే మంచిది. ఈ చిన్న ప్రయత్నం భార్యభర్తల్ని ఆనందంగా ఉంచుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలాగే ఇద్దరి మధ్యా చక్కటి భావవ్యక్తీకరణ ఉండాలి. అప్పుడే అన్యోన్యత పెరుగుతుంది.
- దీంతో పాటు అనుబంధంలో స్నేహం ఉండాలి. అప్పుడు ఈ బంధం పదిలంగా ఉంటుంది. ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి పనులు వారికి ఉంటాయి. ఇద్దరికీ క్షణం తీరిక ఉండకపోవచ్చు. అయినా కూడా సాధ్యమైనంత వరకూ ఇద్దరూ ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలో ఉద్యోగానికి, కుటుంబానికి సంబంధించినవి మాట్లాడకుండా.. ఇద్దరికీ పరిమితమైన విషయాలను మాట్లాడుకోవాలి.
- రోజులో ఒక్కసారైన కలిసి భోజనం చేయాలి. ఇలా చేయడం వలన అనుబంధం పదిలంగా ఉంటుంది. కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాల్లో ఇద్దరి భాగస్వామ్యం ఉండాలి. ఏదైనా విషయంపై గొడవ జరిగినప్పుడు దాన్ని పెద్దగా చేయకుండా ఆలోచించి మాట్లాడుకోవాలి. అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. అన్ని విషయాలు భార్యభర్తలిద్దరికి తెలియడం మంచిది.