Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్నేహమయి... షౌకత్‌ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

స్నేహమయి... షౌకత్‌

ప్రముఖ నటి... షౌకత్‌ కైఫీ ఇటీవలే మరణించింది. రీజనల్‌ నుంచి అప్‌కంట్రీ మీడియా వరకు ప్రముఖ కవి కౖౖెఫీ అజ్మీ భార్య పరమపదించారనో, నటి షబానా అజ్మీ తల్లి చనిపోయారనో రాశాయి. ఒక కవి భార్య... ఒక నటి తల్లి కంటే... అంతకుమించిన జీవితం షౌకత్‌ కైఫీది. పాత హైదరాబాద్‌ గల్లీల్లోంచి వచ్చిన సాధారణ అమ్మాయి... ఓ కమ్యూనిస్టు భార్యగానే జీవితం మొదలుపెట్టినా... తన వ్యక్తిత్వంతో భారత చరిత్రలో అసాధారణ వ్యక్తిగా నిలిచిపోయింది. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌లో కీలక భాగస్వామి. గొప్ప నటి. స్నేహమయి. స్వాభిమానం, అంకితభావం, నిబద్ధతకు మారు పేరు.
         షౌకత్‌ ఖానుమ్‌ తండ్రి యాహ్యా ఖాన్‌. పెండ్లి తరువాత ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నిజాం సంస్థానంలో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌. ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లలను పరదా దాటనివ్వని రోజుల్లో... బిడ్డలను కో-ఎడ్యుకేషన్‌కు పంపించాడు. ఆ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న షౌకత్‌కు చిన్నప్పటినుంచి కళలంటే ఆసక్తి. హస్త కళలంటేమరీ. అందుకే హైదరాబాద్‌లోని అంగళ్లన్నీ తిరిగేది. రంగురంగుల బట్టలను తీసుకొచ్చి జాకెట్లు, కుర్తాలు కుట్టుకునేది. రంగులద్దడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఎంత సున్నితంగా ఆలోచిస్తుందో అంతే రెబల్‌. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం సంప్రదాయ కుటుంబాల్లోని మహిళలకు ఆధునికత, ఫెమినిజం నిషిద్ధ పదాలనే చెప్పుకోవాలి. అలాంటి ఇంట పుట్టినా ఆమె ఏనాడూ బురఖా ధరించలేదు. సరికదా.. అక్కాచెల్లెళ్లలా దుపట్టాను ఒంటిపై కప్పుకోకుండా మెడచుట్టూ స్కార్ఫ్‌లా చుట్టుకునేది. ఆ రోజుల్లో అదే పెద్ద తిరుగుబాటు. తండ్రికి ఔరంగాబాద్‌ బదిలీ కావడంతో కొన్నాళ్లు అక్కడికి వెళ్లింది కుటుంబం. స్కూల్‌ ఉన్నకారణంగా షౌకత్‌, చెల్లి, అన్నయ్య మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. సెలవుల్లో ఔరంగాబాద్‌ వెళ్లడానికి కచ్చితంగా బురఖా ధరించాల్సిందేనన్నాడు వాళ్లన్న. షౌకత్‌ ఒప్పుకోలేదు. అయితే తమతో తీసుకెళ్లనన్నాడు. అలాగేనంటూ ఉండిపోయింది. చివరకు తండ్రి వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. తను నమ్మిన దానికోసం ఎంత కట్టుబడి ఉండేదో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
కైఫీపై ప్రేమ...
కవిత్వం అంటే షౌకత్‌కు ఇష్టం. బోలెడంత ఉర్దూ సాహిత్యాన్ని చదివింది. తండ్రితో కలిసి ముషాయిరాలకు వెళ్లేది. పదాల అల్లిక చేసే మ్యాజిక్‌ను విని ముగ్ధురాలయ్యేది. అట్లా తన పదహారో ఏట.. ఓ ముషాయిరాకు వెళ్లింది. అప్పటికే కైఫీ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. కవిగా మంచి పేరు వస్తున్నది. నుదురు మీద పడుతున్న ముంగురులు, చక్కని ముక్కు, కోల ముఖం, బక్కపలుచగా ఉన్న ఆ యువకుడు ఓ కవిత చదివాడు. అది పాలకులకు వ్యతిరేకంగా పిడికిలెత్తమని... ప్రజలకు పిలుపునిచ్చే ఆ రచన చేయడానికి ఎంతో సాహసం కావాలి. కైఫీలోని ఆ సాహసమే షౌకత్‌కు నచ్చింది. ఆ క్షణమే అతని ప్రేమలో పడిపోయింది. కైఫీతో ఉంటే జీవితం తాను అనుకున్నట్టుగా ఉంటుందని ఆ నిమిషమే నిర్ణయించుకుంది. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో పెండ్లి నిశ్చయమైంది. అయినా కైఫీని తప్ప మరొకరిని పెండ్లి చేసుకోనని ఇంట్లో చెప్పింది. అంధేరీలోని కమ్యూన్‌లో నివసిస్తున్న కైఫీతో వెళ్లడమంటే.. విలాసవంతమైన జీవితాన్ని వదులకుని కష్టాల కడలిని కోరి తెచ్చుకోవడమే. కైఫీని చేసుకుంటే కడుపునిండా తిండి, మంచి బట్టలు కూడా ఉండవని తండ్రంటే... అతనితో కలిసి జీవించేందుకు నెత్తిన మట్టితట్టలు మోయడానికైనా సిద్ధమేనని చెప్పింది. కైఫీ జీవితాన్ని చూసిన తరువాత కూడా ఇదేమాటంటే మీ పెండ్లి చేస్తానన్న హామీతో... ఇంట్లో చెప్పకుండా షౌకత్‌ను బాంబే తీసుకెళ్లాడు తండ్రి. అంధేరీలో కమ్యూన్‌ను చూసిన తరువాత తన కూతురు తిరిగి వచ్చేస్తుందనుకున్నాడు. కానీ అదే తన జీవితమని తండ్రికి తేల్చి చెప్పింది. అంతే మరునాడే పెండ్లి చేసి.. ఉన్న ఐదు వందల రూపాయలు కొత్త దంపతుల చేతిలో పెట్టి ఇంటికి తిరిగొచ్చాడు యాహ్యాఖాన్‌. పెండ్లి విషయం తెలుసుకున్న షౌకత్‌ తల్లి ఖాతూన్‌.. భర్తతో నెలరోజులు మాట్లాడలేదు. 'నచ్చని వ్యక్తికిచ్చి పెండ్లి చేస్తే... మూన్నాళ్లకే విడాకులు తీసుకుని తిరిగి వచ్చేసి ఇంట్లో ఉంటుంది. అదే నచ్చిన వ్యక్తిని చేసుకుంటే కష్టమైనా, సంతోషమైనా బాధ్యతగా ఉంటుంది. అలాగే ఉండనీ' అని నచ్చచెప్పాడు భార్యకు.
కమ్యూనిస్టుగా జీవితం...
తండ్రికి చెప్పినట్టుగానే బాధ్యతతో ఉందామె. కమ్యూన్‌లోని ఒక్క గదిలో చిన్న కుక్కి మంచం, కొన్ని పుస్తకాలు, ఒక స్టవ్‌. దాన్ని అందమైన ఇంటిలా తయారు చేసింది. కమ్యూన్‌లో అందరి మధ్య ఉండే ప్రేమ, స్నేహతత్వం, కామ్రెడరీ షిప్‌... దారంలా కలిపి ఉంచే సమాజం పట్ల అంకితభావం ఆమెనెంతో ఆకట్టుకున్నాయి. ఇంటిని మైమరిపింపజేశాయి. ఏ పనీ చేయకుండా.. పార్టీలో పూర్తి కాలం కార్యకర్తతో కలిసి జీవించడం కష్టమని తొందర్లోనే అర్థమైంది. షౌకత్‌ వంతు డబ్బులు కమ్యూన్‌లో కట్టడం కోసం ఉదయం ఐదు గంటలకే లేచి కైఫీ ఓ ఉర్దూ పత్రికకు ఆర్టికల్స్‌ రాసేవాడు. ఆ కష్టాన్ని చూసి... తాను పని చేయాలని నిర్ణయించుకుంది. షౌకత్‌కి చిన్నప్పటినుంచి రంగస్థలం అంటే ఇష్టం. స్కూల్‌లో కొన్ని నాటకాల్లో నటించింది కూడా. దాంతో ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేయడానికి అవకాశం సులభంగానే వచ్చింది. వాయిస్‌ ఆర్టిస్టుగా పది రూపాయలు సంపాదించిన రోజు ఆమె ఆనందానికి అవధులు లేవు. సొంత సంపాదన ఎంత బలాన్నిస్తుందో తెలిసొచ్చింది. అందుకే మహిళలకు ఆర్థిక స్వావలంబన అవసరమని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పింది. తొలుత బాబు పుట్టి... వైద్యం చేయించే స్థోమత లేక అనారోగ్యంతో చనిపోయాడు. మళ్లీ గర్భం దాల్చింది. అప్పటికే స్వాతంత్య్రం వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ సభ్యులంతా అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి సమయంలో పిల్లలంటే కష్టమే. అందుకే అబార్షన్‌ చేయించుకోవడం మంచిదని సూచించింది పార్టీ. అందుకే మొదటి బిడ్డను పోగొట్టుకున్న దు:ఖాన్ని ఇంకా మర్చిపోని షౌకత్‌.. చేయించుకోనంటే చేయించుకోనంది. ఎవ్వరికీ భారంగా ఉండకుండా హైదరాబాద్‌లో తన తలిదండ్రుల దగ్గరకు వెళ్తానని వచ్చేసింది. షబానా హైదరాబాద్‌లోనే పుట్టింది. షౌకత్‌.. అందరినీ ధిక్కరిస్తూ నిలబడిన మరో సందర్భం. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తరువాత... అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ కొందరిని పాకిస్తాన్‌కు పంపింది. ఆ జాబితాలో కైఫీ పేరు కూడా ఉంది. అదే విషయాన్ని షౌకత్‌తో పంచుకున్నారు కైఫీ. మత విశ్వాసాలతో ఉన్న ఒక దేశంలోకి.. ఆ మతంలోనేపుట్టినా ఏనాడూ ఆ మత విశ్వాసాలు పాటించని తాను వెళ్లనని తెగేసి చెప్పింది. షబానా పుట్టిన తరువాత కమ్యూన్‌ నుంచి కుటుంబం రెడ్‌ఫ్లాగ్‌ హాల్‌కి మారింది. అక్కడా ఒకే గది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాలు, సర్దార్‌ జాఫ్రీ, పీసీజోషీలాంటి వాళ్లతో కలిసి బతకడం.. కవిత్వం, సాహిత్యం, విప్లవం గురించి మాట్లాడుకోవడం... ఆ వాతావరణం ఆమె ప్రపంచాన్ని మరింత విశాలం చేసింది.
థియేటర్‌ ఆర్టిస్టుగా..
పాత్ర ఏదైనా సంపూర్ణ న్యాయం చేసి.. భారతీయ నాటక, సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసి నటి షౌకత్‌. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇప్టా) పరిచయం.. షౌకత్‌ జీవితాన్నే మార్చేసింది. కెమెరా ముందుకు రాకమునుపే నాటకరంగంలో ఆమె నటనా పటిమను చాటుకుంది. ఇప్టా గౌరవాధ్యక్షులైన పృథ్విరాజ్‌ కపూర్‌ స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌లో చేరింది. నెలల పాప షబానాను వెంట పెట్టుకునే థియేటర్‌కి రిహార్సల్స్‌కోసం వెళ్లేది. ఎందుకంటే పాపను చూసుకోవడానికి మనిషిని పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేదు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక.. స్కూల్‌కు సెలవులొచ్చినప్పుడల్లా ఆమెతోపాటు టూర్లకు తీసుకెల్లేది. అప్పుడప్పుడే కైఫీకి సినిమాల్లో పాటలు, డైలాగ్స్‌ రాసే అవకాశాలు వచ్చాయి. తరువాత మకాం జుహూకి మారింది. 1964లో వచ్చిన 'హకీకత్‌' ఆమె మొట్ట మొదటి సినిమా. హీర్‌ రాంజా, గరం హవా, ఉమ్రావ్‌జాన్‌, బాజార్‌, లోరీ, సలాం బాంబే... అన్ని సినిమాల్లో ఆమె చేసిన క్యారెక్టర్స్‌ చాలా టిపికల్‌. ఆ పాత్రల్లో ఎక్కడా షౌకత్‌ కనిపించదు. అందుకే ఆ సినిమాలు వచ్చి ఇన్నాళ్లయినా ఆ క్యారెక్టర్స్‌ ఇంకా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఆమె చివరి సినిమా సాథియా- 2002లో వచ్చింది. సినిమాల్లో చారిత్రక నేపథ్యానికి సాక్షిగా నిలిచింది. ఉమ్రావ్‌జాన్‌, అంజుమన్‌ సినిమాల షూటింగ్‌కు కొన్ని నెలల ముందునుంచే ఆ పాత్రల్లో జీవించడం మొదలుపెట్టేది షౌకత్‌. 'సలాం బాంబే' సినిమాలోనూ అంతే. ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లి కామటిపురాలో వాళ్ల జీవితాలు తెలుసుకున్నది.
విశాల హృదయం..
గ్లామరస్‌ సినిమా ప్రపంచంలో ఉన్నా... వాళ్లిద్దరూ నిరాడంబరంగానే జీవించారు. చివరివరకూ కమ్యూనిస్టులుగానే బతికారు. షౌకత్‌ది విశాలమైన హృదయం. కైఫీ, షబానా, బాబాలను ఎంత ప్రేమగా చూసిందో... బంధువులు, స్నేహితులు, తోటి కామ్రేడ్స్‌, తోటమాలి, డ్రైవర్‌, వంటవాళ్లు, పనివాళ్లు, డాక్టర్లు, నర్సులు... తన జీవితంలోకి నడిచొచ్చిన ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంది. కైఫీతో 55 ఏండ్ల జీవితాన్ని ఉర్దూలో 'యాద్‌ కె రాఁగుజర్‌' పుస్తకం రాసింది. దాన్ని నస్రీన్‌ రహ్మాన్‌ ఆంగ్లంలోకి 'కైఫీ అండ్‌ ఐ'గా అనువదించింది. ఆ పుస్తకాన్ని తెలుగులో 'తలపుల తోవ'గా ఎన్‌.వేణుగోపాల్‌ తీసుకొచ్చారు. ఆ పుస్తకం వాళ్ల జ్ఞాపకాల మాలే అయినా.. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్‌, స్వాతంత్య్రోద్యమ సమయం, ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ చరిత్రకు సాక్షీబూతం కూడా. ' కైఫీ నా జీవితంలో విప్లవం తీసుకొచ్చాడు' అని చెప్పిన షౌకత్‌... ఆ విప్లవాన్ని జీవితకాలం కొనసాగించింది. తన పిల్లలు షబానా అజ్మీ, బాబా అజ్మీలకు అదే బాట చూపించింది.
- కట్ట కవిత

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
మారుతున్న ఆలోచనలు
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...
జిడ్డు చర్మానికి...
ముత్యాల ముగ్గులు
ఆత్మరక్షణే మా ఆయుధం
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
చరిత్ర గుర్తించని ధిశాలి ఫాతిమా షేక్‌
సహజసిద్ధంగా మెరిసిపోండి
వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు
బరువు తగ్గాలా..?
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
సంక్రాంతి రుచులు...
ఆత్మపరిశీలన చేసుకోవాలి
ముత్యాల ముగ్గులు
కంటెంట్‌ సృష్టికర్త నిహారిక
పాలిచ్చే తల్లులకు
సంక్రాంతి ముగ్గులు

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.