Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న సంఘటనలు చాలా వింటున్నాం. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా బయటకు వెళ్ళే వారు సురక్షితంగా ఇంటికి వస్తారో లేదో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. పోలీస్‌లు ఎంత రక్షణ కల్పించినా ఎవరికి వారు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే కిడ్నాపర్ల నుంచి తప్పించుకోవచ్చు. ఒంటరి అమ్మాయిలను టార్గెట్ చేసుకుని కిడ్నాప్ ప్రయత్నం చేసే అగంతకులకు ఎలా బుద్ధి చెప్పవచ్చో ఈ వారం తెలుసుకుందాం.
స్టెప్ 1 : ఒంటరిగా కూర్చున్న అమ్మాయిని వెనక నుంచి వచ్చి కర్చిఫ్‌తో నోటిని మూయాలని ప్రయత్నించాడు ఒక వ్యక్తి. అప్రమత్తమైన ఆ అమ్మాయి కర్చిఫ్‌కు తగలకుండా తల కాస్త వెనక్కి జరిపింది.
స్టెప్ 2 : మరుక్షణం ఎడమచేతితో కర్చిఫ్ పట్టుకున్న అతని చేతి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని కుడిచేతితో అతని చేతి ఎల్‌బో వద్ద పట్టుకుంది. తప్పించుకుని పోయే అవకాశం ఇవ్వకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుని పైకి లేచింది.
స్టెప్ 3 :ఎడమచేతిలో అతని చేతి మణికట్టును గట్టిగా పట్టుకుని కుడిచేతితో గొంతు పట్టుకుంది.
స్టెప్ 4:అమ్మాయి ప్రతిఘటనను ఊహించని ఆ వ్యక్తి అదుపు తప్పి కింద పడిపోతాడు. అతని కడుపులో బలంగా కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలి.