Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులను ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. ఎన్ని రోజులకు మార్చాలనేది తెలీదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మనం రోజూ వాడుకునే కొన్ని వస్తువులకు ఎక్స్‌ఫైరీ డేట్ ఉంటుంది.
బాడీ స్పాంజ్, షవర్ పఫ్‌లను రోజూ వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వాడకూడదు.
- దువ్వెనను వారానికి ఒకసారి కనీసం పదిహేను రోజులకొకసారి శుభ్రం చేస్తూ వుండాలి. అదేవిధంగా ఏడాది కంటే ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు.
పెర్ఫూమ్ బాటిల్ తెరిచిన తర్వాత కేవలం ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి.
- రోజూ ఉపయోగించే జాగింగ్ షూస్‌ను ఒక ఏడాది కన్నా ఎక్కువ వాడకూడదు. వాటిలో ఉన్న కుషనింగ్ తగ్గిపోతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.
లోదుస్తులు ఆర్నెల్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
- ప్రతిరోజూ వాడే టూత్‌బ్రష్‌లను మూడు నెలలకు ఒకసారి మార్చాలి.
తడిగా ఉన్న టవల్స్ మీద బ్యాక్టీరియా చేరుతుంది. వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. ఒక టవల్‌ను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉపయోగించకూడదు.
- చెప్పులకు బ్యాక్టీరియా అధిక శాతంలో ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి. ప్రతి ఆరు నెలలకూ మారుస్తుండాలి.
- సరైన తలగడ లేకపోతే మంచి నిద్రను కోల్పోవాల్సిందే. ఫలితంగా మెడ నొప్పులు కూడా వస్తాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మారుస్తుండాలి.