Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కొన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయో తెలుసుకోవాలి.
ఐరన్ రిచ్ ఫుడ్స్: ఐరన్ అనేది మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మోనోపాజ్ దశకు ముందు.. మటన్, చికెన్, చేపలు, ఉడికించిన గుడ్డు, మనట్ లివర్, ఖర్జూర, సజ్జలు, బెల్లం, ఆకుకూరలు, బీన్స్ కొన్ని ఫార్టిరైడ్ ఐరన్ రిచ్‌ఫుడ్స్, రెడీటు ఈట్ సెరల్స్ మొదలైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.
విటమిన్ 'సి' : ఆహారంలో ఉండే ఐరన్ శరీరం గ్రహించడంలో విటమిన్ 'సి' ఉపయోగ పడుతుంది.
అయితే విటమిన్ సి ఎక్కువగా అందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
ఉదా: 1. పాలకూరను తిన్న తర్వాత కమలా పండు ముక్కలు తినండి.
2. బెల్లంతో రాగి జావ తీసుకున్న తర్వాత స్ట్రాబెర్రీస్ కానీ జామ కాని నిమ్మరసం లాంటివి తీసుకోవాలి.
ఫోలిక్ ఆసిడ్: ఒక స్త్రీ తల్లి కావల్సిన దశలో ఆమెకు ఫోలిక్ ఆసిడ్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలదు. బిడ్డలో ఏ లోపాలు లేకుండా ఇది నివారిస్తుంది. సాధారణ మహిళలకు రోజుకు 400 ఎంసీజీ ఫోలిక్ ఆసిడ్ అవసరం. కాబోయే తల్లులు, పాలిచ్చే తల్లులకు 600 ఎంసీజీ నుండి 500 ఎంసీజీ వరకు అవసరం అవుతుంది.
ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ (నిమ్మ, ఉసిరి, బత్తాయి, కమల) బీన్స్ విటమిన్ 'బి' అందేలా చేస్తుంది. దీనితో పాటు రోజుకు 3-4 లీటర్ల నీరు తీసుకోవాలి.
కాబోయే తల్లులు ఆహారంతో పాటు డైటరీ సప్లిమెంట్ ఫోలిక్ ఆసిడ్ తప్పనిసరిగా తీసుకోవాలి.
కాల్షియం, విటమిన్ 'డి': 1200-1500ఎంసీజీ రోజుకి కావల్సిన కాల్షియం. ఎముకల గట్టి దనానికి ఇది ఎంతో అవసరం.
కాల్షియం, విటమిన్ 'డి' ఎముకలు, దంత ఆరోగ్యంలో చాలాముఖ్య పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా ఉండే వెన్న తీసిన పాలు, చీస్, పనీర్, చేపలు, గుడ్లు, బోన్‌సూప్, ఆకుకూరలు, ఖర్జూర వంటివి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యాయామం: పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు శరీరానికి వ్యాయామం కూడా అవసరం. రోజువారి పనులతో పాటుగా శరీర ఆరోగ్యానికి సమయం తప్పనిసరిగా కేటాయించాలి.
ఇది వారి శరీర ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి, మానసికంగా చురుకుగా ఉండటానికి ఉపయోగపడు తుంది. ఇది వారిని ఊబకాయం నుంచి భవిష్యత్‌లో వచ్చే డయాబెటీస్ (చక్కెర వ్యాధి) గుండె సమస్యల నుంచి కాపాడుతుంది.