Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆన్‌లైన్ షాపింగ్ కొందరికి నచ్చితే, చాలా మందికి నచ్చదు. ఇక బట్టల విషయంలో అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ భయానికి గల అసలు కారణం ఏంటంటే ఆన్ లైన్ షాపింగ్‌లో పొరపాటున నచ్చని వస్తువు కొన్నా, లేదంటే వస్తువు అనుకున్నట్లుగా లేకపోయినా వాపసు చేయడం ఎలాగా అని? అలాంటి వారి కోసమే ఈ 4 సలహాలు.
మేజర్మెంట్స్ బాక్స్ చెక్ చేసుకోవడం
ఒక వస్తువుని కొనేప్పుడు మనం చేసే ప్రథమ తప్పిదం ఏంటంటే మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం. ఒక చొక్కానో, లేక ప్యాంటు కొనేప్పుడు మేజర్మెంట్స్ బాక్స్‌లో అన్ని వివరాలు సరిగ్గా గమనిస్తే అది మన సైజు కి సరిపోతుందా లేదా అనే విషయంలో సరయిన అవగాహన వస్తుంది.
డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి
ప్రతి పోర్టల్‌కి ఒక డిజైనర్ ఉంటారు. వాళ్ళు తాము చేసే దుస్తులు వీలయినంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. కావున, మనం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మీరు ఇష్టపడిన దుస్తులు ఒక సాధారణ వ్యక్తిపై చాలా భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కోసారి వాటికి బెల్ట్ కానీ వేరే ఇతర వస్తువు తగిలించి కనిపించొచ్చు. అయితే అది మనం తీసుకునే వస్తువుతో జత చేయబడి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి, మీకు అన్ని విషయాల్లో సరయిన అవగాహన వస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం
ఏదయినా వస్తువు కొనాలనుకున్నప్పుడు, మీరు ఇంతకు ముందు దానిని చూడని సందర్భంలో, ఆ వెబ్ సైట్ యొక్క ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం. ఎందుకంటే, మీకు ఆ వస్తువును రకరకాల కోణాల్లో చూసే అవకాశం ఉంది. చెప్పలేం, మీకు తెలిసిన వారెవరయినా అది ఇంతకు ముందు ధరించి ఉండవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల మీకు ఆ దుస్తులపైన సరైన అవగాహన వచ్చి, మీరు కొనొచ్చో లేదో నిర్ణయం తీసుకోవచ్చు.
ఫాబ్రిక్ విషయంలో జాగ్రత్త వహించండి:
ఎల్లప్పుడూ, మీరు కొనే ఫాబ్రిక్ నాణ్యత, సౌకర్యం విషయంలో మీకు ఇంతకు మునుపు ఉన్న బట్టలతో పోల్చి చూడండి. చాలా సందర్భాల్లో మీరు కొనే దుస్తులు మెటీరియల్ వల్ల కానీ లేదా మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అనే దాని బట్టి ఇష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఓ ఫాబ్రిక్ నిపుణులవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర ఇంతకు ముందు ఉన్న దుస్తుల ఫాబ్రిక్‌లో ఏది సౌకర్యవంతంగా ఉందో అదే ఫాబ్రిక్ దుస్తులు తీసుకుంటే మంచిది.