Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే పెద్ద పెద్ద పరికరాలు, శుభ్రపరిచే రకరకాల కాస్ట్లీ ఉపకరణాలు ఉండాల్సిన అవసరం లేదు. పనిని వాయిదా చేయకుండా ఎప్పటికప్పుడు ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని శుభ్రపరచడం వల్ల ఎలాంటి ఢోకా ఉండదు. ఇంట్లో ఉపయోగపడే క్లీనింగ్ టిప్స్ ఏంటీ..
ఇంట్లో ఫ్లోర్‌పై కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, నూనె మరకలు పడినపుడు వెంటనే ఆ ప్రాంతంలో నీళ్లు పోసి శుభ్రం చేయటం మంచిది. తద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
వంటగదిని శుభ్రంగా ఉంచుకోవటం చాలా కష్టమైన పని. ముఖ్యంగా సింకుని క్లీన్‌గా - ఉంచుకోవటంలోనే అసలైన పనితనం ఉంటుంది. సింక్ బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రెండురోజులకి ఒకసారి సింక్‌ని క్లీన్‌గా కడగాలి.
వంటగదిలో ఎక్కువగా నీళ్లతో పాటు ఆహారపదార్థాలు కిందపడుతుంటాయి. అవి అలాగే వదిలేస్తే కాళ్ల కింద పడటం, దీంతో పాటు అవి కుళ్లిపోయి వాసన వస్తాయి. వీటివల్ల చిన్నపురుగులు, బొద్దింకలు, బల్లులు ఇంట్లో ఎక్కువగా తిరుగుతాయి. తర్వాత బాధపడటం కంటే ముందే శుభ్రత విషయంలో కఠినంగా ఉంటే మంచిది.
ఎక్కువ రోజులు జీన్సుప్యాంట్స్‌ని ఉపయోగిస్తే బ్యాడ్‌స్మెల్ వస్తుంది. అందుకే జీన్స్‌ని రాత్రంతా ఫ్రీజర్‌లో పెడితే బాక్టీరియా తొలగిపోతుంది. తర్వాత శుభ్రపరచుకోవచ్చు.
ఇంట్లో ఉండే వంటసోడాకి, కాస్త నిమ్మరసం కలిపి గ్లాసులు, స్టీల్ పాత్రలు క్లీన్ చేసుకుంటే అవి మెరుస్తాయి.
బాత్రూమ్, టాయిలెట్స్‌ని వంటసోడా లేదా వెనిగర్ లో కాసిన్ని నీళ్లు పోసి క్లీనర్స్‌గా ఉపయోగించుకోవచ్చు.