Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రంతా టీవీ, లేదా నెట్‌లో కాలక్షేపం చేయటం తగ్గించి ఉదయాన్నే నిద్రలేవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. తెలీకుండానే మనిషిలో ఏదైనా చేస్తాననే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
నిద్రలేవాలనుకున్న సమయానికి అరగంట ముందు అలారంసెట్ చేయాలి. ఉదయాన్నే నిద్ర లేచాక గోరు వెచ్చని నీళ్ళు లేదా నిమ్మరసం తాగటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ నశిస్తాయి.
కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్‌సైజ్ చేయాలి. అలా చేస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా రోజంతా చురుకుగా ఉంటారు.
ఆ రోజు చేయాల్సిన పనుల్ని, ప్రధానమైన విషయాల్ని రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇది అలవాటుగా మార్చుకుంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది. ట