Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సంఖ్యనే తప్ప.. సమస్య కాదు.. | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

సంఖ్యనే తప్ప.. సమస్య కాదు..

'పిల్లలను స్కూల్‌లో దింపడానికో.. బజారు నుంచి కూరగాయలు తెచ్చుకోవడానికో.. ఆఫీస్‌కు వెళ్ళడానికో ఇలా ప్రతిరోజూ టూవీలర్‌తో పనిపడుతూనే ఉంటుంది. బండి నడపడానికి భయపడే మహిళలు ఇంట్లోవారిపై ఆధారపడటం, ఆటోలకు డబ్బులు ఖర్చు చేయడం చేస్తారు. చదువుకున్న మహిళలు ఇంటిని ఎంత బాగా తీర్చిదిద్దుకోగలరో బండి నడపడం వచ్చిన మహిళ లు అంతకన్నా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు అందుకే అమ్మాయిలకు ముఖ్యంగా ఆంటీలకు బండి నేరించే లక్ష్యంతో' స్త్రీ రైడ్స్‌' ఏర్పాటు చేశాం' అంటున్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు చిగుళ్ళపల్లి అర్చన. డ్రైవింగ్‌ ఫోబియా ఉన్నవారిలో ఫోబియా తొలగించడంతో పాటు డ్రైవింగ్‌ నేర్చించి వారిలో ఆత్మధైర్యం పెంచుతున్న ఆమె పరిచయం..
      మాది బెంగుళూర్‌. అక్కడే పుట్టాను. నాన్న నరేష్‌ బిజినెస్‌మ్యాన్‌. నా చిన్నప్పుడే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాం. అమ్మ జమున, గృహిణి. నాకు ఒక తమ్ముడు. అతను ఇప్పుడు సినిమాటోగ్రాఫర్‌గా విదేశాల్లో పనిచేస్తున్నాడు.
ఇంటినుంచే..
మా ఇంట్లో చాలా స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. దాంతో నేను తమ్ముడు స్నేహితుల్లా పెరిగాం. అమ్మాయి అంటూ ఏనాడూ నన్ను వేరుగా చూడలేదు మా అమ్మనాన్న. హౌలీ ఫ్యామిలీ స్కూల్‌లో చదువుకున్నాను. ఆరోతరగతిలో ఉన్నప్పుడే నాన్న చేతక్‌ బండి నేర్పించారు. మా కాలనీలో టూవీలర్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్న ఫస్ట్‌ అమ్మాయిని నేనే. డాన్స్‌ అంటే చాలా ఇష్టం. క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకున్నాను. ఏదీ నేర్చుకుంటామన్నా వద్దన్నకుండా నేర్పించేవారు. స్కూల్‌లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఇంటర్‌ బద్రుకా కాలేజ్‌లో చదివిటప్పుడు బైక్‌పై కాలేజీకి వెళ్ళేదాన్ని. ఆడపిల్లలు, మగపిల్లలు సమానం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి.
పడతామన్న భయం..
నేను బైక్‌పై కాలేజీకి వెళ్ళితే చాలామంది అమ్మాయిలు ఆశ్చర్యంగా చూసేవారు. అబ్బాయిలు అయితే మగరాయుడు అంటూ కామెంట్స్‌ చేసేవారు. కామెంట్‌ను కూడా కాంప్లిమెంట్‌గా తీసుకునేదాన్ని. బండిని హ్యండిల్‌ చేయడం తెలియాలి. అంతే తప్ప జెండర్‌ ఎందుకు అన్నది నా అభిప్రాయం. అమ్మాయిలను చాలామంది అబలలు అంటూ బలహీనులుగా చేసి మాట్లాడుతారు. అందుకే వారిలో వారికి తెలియకుండానే భయం ఉంటుంది. ఆ భయంతోనే డ్రైవింగ్‌ నేర్చుకోవాలంటే కింద పడతామని, గాయాలు తప్పవని భయపడతారు. అలాంటివారిలో డ్రైవింగ్‌ ఫోబియా చిన్నప్పటి నుంచే ఉంటుంది. కాలనీలో, కాలేజీలో చాలామంది అమ్మాయిల్లో, నా స్నేహితుల్లో భయం పోగొట్టి బండి నడపడం సులువుగా నేర్చించేదాన్ని. ఆ తర్వాత బండి నేర్చుకోవడం వల్ల వాళ్ళవాళ్ళ జీవనశైలిలో వచ్చిన మార్పులు చెబుతుంటే వారి కండ్లలో ఆత్మవిశ్వాసం కనిపించేది.
చదువుతూనే..
లయోల కాలేజీలో బి.కాం చదువుతున్నప్పుడు పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి సొంతంగా ఆలోచించడం, ఇతరులకు సహాయం చేయడం అమ్మనాన్నల పెంపకం వల్ల అలవడ్డాయి. ఎయిర్‌ హౌస్టెస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి కొన్నిరోజులు ఉద్యోగం కూడా చేశాను. డిగ్రీ తర్వాత ఎంబిఏ పూర్తి చేశాను. ఆ తర్వాత బిజినెస్‌మ్యాస్‌ సంతోష్‌ కుమార్‌తో పెండ్లి జరిగింది. మాకు ఇద్దరు అమ్మాయిలు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం నాకు స్వేచ్ఛను ఇస్తే మెట్టింట్లో వాతావరణం ఏదైనా సాధించాలన్న పట్టుదలను ఇచ్చింది. అత్తయ్య, మామయ్య, మా వారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. వారి సపోర్ట్‌ తోనే ఇప్పుడు 'స్త్రీ రైడ్స్‌' ప్రారంభించాం.'ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు' అని నాన్న నేర్పిస్తే .. 'మనం చేసే పనులతో నలుగురికి స్ఫూర్తిగా నిలవాలి' అంటూ మావారు ప్రేరణ ఇచ్చారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించేలా..
' కేవలం డ్రైవింగ్‌ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇంట్లో చేసే పని చాలదు అన్నట్లు బయట పనులు కూడా మేమే చేయాల్సి వస్తుంది?' అని భావించే మహిళలు కూడా ఉన్నారు. మేం కేవలం డ్రైవింగ్‌ నేర్పించడంతో పాటు వారికి ఆసక్తి మేరకు ఉద్యోగాల అవకాశాలు కూడా చూపిస్తాం. మావద్ద ట్రైనర్లుగా కూడా నియమిస్తాం. మార్కెటింగ్‌ రంగంలో కొత్తగా వస్తున్న ఎన్నో డెలివరీ యాప్స్‌తో మా సంస్థ ఒప్పందం చేసుకుంటోంది. రానున్న కాలంలో మహిళలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
తపన ఉండాలి..
నాన్న, అన్న,తమ్ముడు, భర్త, కొడుకు, స్నేహితులు ఇలా ఎవరో ఒకరు మనకు సపోర్ట్‌గా ఉంటారు. అయితే వాళ్ళపైనే పూర్తిగా ఆధారపడకూడదు. ఇంట్లో సపోర్ట్‌ ఎంత ఉన్నా.. ఏదైనా చేయాలనే తపన, పట్టుదల, కొత్త విషయం నేర్చుకోవాలన్న ఆసక్తి, ఓపిక మనకు లేకపోతే మాత్రం కష్టం. డ్రైవింగ్‌ నేర్చుకోవడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ, డ్రైవింగ్‌ వచ్చిన మహిళల్లో ఆత్మవిశ్వాసం కొండంత పెరుగుతుంది. బలమైన వ్యక్తిత్వం వారి సొంతమవుతుంది. మా సంస్థను దేశంలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాలకు కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం మా టీమ్‌ మెంబర్స్‌ ఐఐటీయన్లు శివ, ప్రకాష్‌, సుహాన్‌ చేస్తున్నారు.
తమ కోసమే..
బండి నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. అయితే వారిలో ఉన్న భయం ముందు పోవాలి. అప్పుడే సులభంగా డ్రైవింగ్‌ వస్తుంది. మా వద్దకు 16ఏండ్ల నుంచి 60ఏండ్ల వయసు వారు కూడా వస్తున్నారు. 60ఏండ్ల అమ్మమ్మలకు డ్రైవింగ్‌ ఎందుకు అన్న ఆశ్చర్యం కలుగుతుంది. వారు కేవలం తమ కోసం మాత్రమే బండి నేర్చుకున్నారు. 'కాలక్షేపం కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కాలనీలోని గుడికి వెళ్ళాలన్నా, నాలుగు సందుల అవతల ఉన్న స్నేహితులను కలవాలన్నా కష్టంగా ఉందని అందుకే బండి నేర్చుకోవడానికి వచ్చామని' చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే తప్ప సమస్య కాదని వారిని చూసి తెలుసుకున్నాను.
వారం రోజుల్లో..
కాలనీలో, కాలేజీలో నా స్నేహితులకు బండి నేర్పించిన అనుభవంతో చాలా సులభంగా తక్కువ సమయంలో డ్రైవింగ్‌ పూర్తి స్థాయిలో నేర్పిస్తాం. సైకిల్‌ రానివారికైనా, డ్రైవింగ్‌ అంటే భయం ఉన్నవారికైనా సరే సరిగ్గా వారం రోజుల్లో బండి నేర్పిస్తాం. మేం చెప్పే టెక్నిక్స్‌ వల్ల నూటికి నూరుశాతం వస్తుంది. ఎవరికైనా రాలేదు అంటే వచ్చేవరకు నేర్పిస్తాం. అంతేకాదు వాళ్లకు మాక్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తాం. డ్రైవింగ్‌తో పాటు సెల్ఫ్‌ డిఫెన్స్‌, సెఫ్టీ రూల్స్‌, ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పనిసరిగా చెబుతాం. సోమ వారం నుంచి శనివారం వరకు కొన్ని బ్యాచ్‌లు, వీకెండ్స్‌లో మరికొన్ని బ్యాచ్‌లు ఉంటాయి.
ప్రతి మహిళా..
డ్రైవింగ్‌ నేర్చుకోవడం మహిళల జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తుంది. తమ జీవితాన్ని తమ నిర్ణయాలకు అనుగుణంగా మలుచుకోవడం తెలుస్తుంది. అందుకే ప్రతి మహిళ డ్రైవింగ్‌ నేర్చుకోవడం మంచిది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మగవారికి ధీటుగా పని చేస్తా
క్రమంగా బరువు తగ్గండి
ఇలా తరిమేయండి...
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
మారుతున్న ఆలోచనలు
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...
జిడ్డు చర్మానికి...
ముత్యాల ముగ్గులు
ఆత్మరక్షణే మా ఆయుధం
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
చరిత్ర గుర్తించని ధిశాలి ఫాతిమా షేక్‌
సహజసిద్ధంగా మెరిసిపోండి
వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు
బరువు తగ్గాలా..?
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
సంక్రాంతి రుచులు...
ఆత్మపరిశీలన చేసుకోవాలి
ముత్యాల ముగ్గులు

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.