Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్‌ఫ్లో 2లక్షల 10వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2లక్షల 25వేల క్యూసెక్కులు
- ప్రస్తుతం 6.212టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఎగువ కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి నుంచి నారాయణ పూర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అ దే స్థాయిలో దిగువన ఉన్న జూరాలకు నీటి ని విడుదల చేశారు. దీంతో ఎగువ నుంచి భారీ గా వరద నీరు చేరుతుండడంతో 28 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. నారా యణపూర్ నుంచి 2లక్షల 10వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా అదే స్థాయిలో 2లక్షల 25 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతు న్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9. 615టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.212 టీఎ ంసీల నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 22 క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా వదు లుతున్నారు. దీని ద్వారా మూడు యూనిట్లలో 117మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. యథావిధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీ మా -1కు 0 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 750 క్యూసెక్కులు, కుడి కాల్వకు 730 క్యూ సెక్కులు, కోయిల్ సాగర్‌కు - 315 క్యూసె క్కులు, సమాంతర ప్యానల్ ద్వారా 300 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దిగువ ప్రాంతానికి 2లక్షల 25వేల క్యూ సెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారు లు తెలిపారు. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూ చిస్తున్నారు.
బీచ్‌పల్లిలో కృష్ణమ్మ ఉధృతి
ఇటిక్యాల: మండలంలోని బీచ్‌పల్లిలో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ చూపరులను ఆకటు ్టకుంటోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షా లకు జూరాలకు అధిక మొత్తంలో వరదనీరు చేరడంతో దిగువ ప్రాంతమైన శ్రీశైలానికి రెం డు లక్షల 52 వేల క్యూసెక్కులకు పైగా నీటిని వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. 44వ జాతీయ రహదారి పక్క నే నదితీరం ఉండడంలో పర్యాటకులు, వాహ నదారులు కృష్ణమ్మ ప్రవాహాన్ని చూసి పరవ శించి పోతు న్నారు.