Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్
- అప్రమత్తమైన అధికారులు
నవతెలంగాణ - దేవరకద్ర
దేవరకద్ర మండలంలో కరోనా అలజడి సృష్టిస్తోంది. అందులో భాగంగానే మ ండలంలోని పేరూరు గ్రామంలో ఒకే కుటు ంబంలో మూడు పాజిటివ్ కేసులు నమోద య్యాయి. వారం క్రితం ఈ కుటుంబ సభ్యులు తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరై వచ్చారు. అప్పటి నుంచి అరోగ్యం బాగా లేక పోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయి ంచుకున్నారు. వీరికి కరోనా సోకినట్లు నిర్దా రణ కావడంతో వైద్యురాలు షబానా బేగం సి బ్బంది, పోలీసులు అక్కడికి వెళ్లి కరోనా బాధి తులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారికి కావాల్సిన మందులు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దీంతో మండలంలో ఇప్పటి వరకు 19 కేసులు నమో దైనట్లు వైద్యురాలు తెలిపారు.
కంటైన్మెంట్ జోన్లను పరిశీలన
భూత్పూర్ మండలం అన్న సాగర్ గ్రామం లో కంటైన్మెంట్ జోన్లను మంగళవారం ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. కరో నా బాధితులకు తగు సూచనలు, సలహాలి చ్చారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయం మూత
వెల్దండ : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ సేవకులుగా విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో తహసీ ల్దార్ కార్యాలయాన్ని 10రోజుల పాటు మూసి వేస్తున్నట్లు తహసీల్దార్ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా రైతులెవ్వరూ 10 రోజుల పాటు కార్యా లయానికి రావద్దని, పెండింగ్‌లో ఉన్న అర్జీల ను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదుల కోసం కార్యాలయంలో బయట బాక్స్ ఏర్పాటు చేస్తామని, అందులో తమ ఫిర్యాదులు వేయా లని సూచించారు. ప్రజలు దీన్ని దష్టిలో ఉం చుకుని కార్యాలయానికి రాకపోవడమే మంచి దని తెలియజేశారు.